Wednesday, 28 September 2011
పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: స్వరార్చన
పుట్టపర్తి అనూరాధ అక్షర కలశం: స్వరార్చన: సరళీ వరుసలతోనే ..తొలి అడుగుల గమనం.. మాయామాళవ గౌళం అందించును హస్తం.. గీతాలు..అలంకారాలు..వర్ణాలూ ..జతులూ.. మైలురాళ్ళు..గీటురాళ్ళు..నీటిస...
Sunday, 25 September 2011
ఫస్ట్ టాక్
రాధ సినిమాకెళ్ళింది..
రాధ ఆమె ఫ్రెండ్సూ..కబుర్లు చెప్పుకుంటూ సినిమా చూసారు..
ఇంటర్వెల్ లో పాప్ కార్న్ తిన్నారు..కూల్ డ్రింక్ తాగారు..
రాధ స్నేహితురాళ్ళు రాధ లానే జాలీ మనుషులు కొత్త కొత్త చీరలు వెరైటీ కొనడం..వాచీలు సెంట్లూ ఇంపోర్టెడ్ వస్తువులు ప్రదర్శించడం మొత్తానికి జీవితాన్ని ఎంజాయ్ చెయ్యటం వారికి తెలిసినంతగా ఎవరికీ తెలియదేమో..
కానీ సినిమా వారికి నచ్చలేదు ..పాత సినిమాలలోని సీన్లనే కొత్తగా రాయడానికి ట్రయ్యింగు..
కానీ వారికి బాధలేదు ..వారొచ్చింది సరదాకి..
సినిమా బయట టీవీ వాళ్ళు కెమెరాలతో రెడీ గా వున్నారు..
ఫస్ట్ డే ఫస్ట్ షో ..
టాకెలా వుందో అని నిర్మాత దర్శకుడూ..హీరో అందరూ ఒకటే టెన్షను..
సినిమా అయిపోయి తలుపులు తీయగానే ఒక్కసారిగా జనం బయట పడ్డారు..
వెంటనే కెమెరాలు ముందుకురికాయి..
మైక్ లు ప్రేక్షకుల ముఖాల మీదకు పరుగెత్తాయి..
కేక..
100 డేస్..
సూపర్ హిట్టూ..
పాటలదిరాయి..
ఐటం సాంగ్ పిచ్చ పిచ్చగా వుంది..
అన్నా.. 200 డేస్ గ్యారంటీ..
హీరోయిన్ లుక్స్ బావున్నాయి..
అందరూ కెమెరాలో ముఖం పెట్టి ఏదో ఒకటి చెప్పి కెవ్వున కేకలేస్తూ..ముందుకు వెళ్తున్నారు..
టాక్ చూడటానికొచ్చిన హీరో దర్శకుడూ..నిర్మాత అట్రాక్షన్ కోసం హీరోయిన్ అందరూ.. అభిమానులకు చేతులూపుతూ..దిగుతున్నారు..
ఎవరో దర్శకుడిని అడుగుతున్నారు..
ప్రేక్షకుల స్పందన ఎలాగుందని మీరనుకుంటున్నారు..?
చాలా బాగుంది..నేను ఊహించినదానికన్నా బాగా రిసీవ్ చేసుకున్నారు అభిమానులు ..
అవునవును ..కొన్ని చోట్ల డైలాగులకు ప్రేక్షకులు విజిల్సూ చప్పట్లూ..అప్పుడే నాకర్థం అయిపోయింది..సినిమా సూపర్ డూపర్ హిట్టని..
దర్శకుడూ..నిర్మాతా ఇద్దరూ కలిసి చెప్పారు..
ఇంతలో అనుకోకుండా రాధ ముందుకు మైకొచ్చింది..చూడటానికి డీసెంట్ గా వున్న ఆమె చక్కటి కామెంట్ చేస్తుందని అనుకున్నారు అందరూ..
ఇంతకుముందు మూగ సినిమాలుండేవి..
తర్వాత టాకీలొచ్చాయి..పాటలొచ్చాయి..
కలరొచ్చింది..
ఇప్పుడు కంపు సినిమాలు తయారు చేస్తున్నారు..
అనేసి వెళ్ళిపోయింది ..
హీరో దర్శకుడూ..నిర్మాతా తలెక్కడ పెట్టుకోవాలో తెలియక చచ్చారు..
Subscribe to:
Posts (Atom)