సినిమాలూ..చెట్టు చాటు సీన్లు..
హమ్మయ్య..నేనేం చెప్పదల్చుకున్నానో.. కనిపెట్టేశారా..
సినిమాలో పాటల్లో అప్పుడప్పుడూ..హీరో హీరోయిన్లు..ఓ నిమిషం పాటు చెట్టు చాటుకు వెళ్ళిపోతుంటారు..రెండు జంట పువ్వులు తెరకు అడ్డం పడేవి..
ఓ నిమిషం తర్వాత..ఆ అమ్మాయేమో మూతి తుడుచుకుంటూ..సిగ్గుపడుతూ..బయటికి వస్తుంది..ఆ అబ్బాయేమో ఏదో ఘన కార్యం చేసిన వాడిలా దరహాసం చిందిస్తూ..కూడా వస్తాడు..
గుర్తొచ్చిందా..గుర్తొచ్చిందా..
ఎప్పుడైనా సినిమాల్లో ఆ సీన్లు వస్తే ఇక మేము చచ్చామే..మా అక్కయ్య మా వేపు గాభరాగా..చూసి ..పెద్దవైన తన కళ్ళను మరింత పెద్దవిగా చేసి అన్నీ..చూసి చస్తారు..అని గదమాయిస్తుంది..
సినిమాలో మేము అందుకనే మా అక్కయ్య పక్కన లేకుండా..కాస్త దూరంగా కూచునే వాళ్ళం ..
అలాంటి సీను వస్తుందంటేనే గుండెల్లో భయం పుట్టేది..
ఇక ఈ కాలంలో ..
చెట్లూ..పూవులూ మనం మన మొహాలకు అడ్డం పెట్టుకొని కూచోవాల్సిన పరిస్థితి వచ్చింది..
ఆ ఎదవ సీన్లన్నీ చూసి పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని ..మనం హడలి చావాలే..గానీ ..వాళ్ళు అన్నిటికీ అలవాటు పడిపోయారు..హాలీవుడ్ సినిమాలకు దీటుగా మన సినిమాలు అలరారుతున్నాయివ్వాళ..
అల్లాంటి సీన్లొస్తే..పిల్లలే గబుక్కున చానల్ మార్చి వారి పరి పక్వతని చాటుకుంటున్నారు..మనం చెడిపోకుండా..ఆరిందాల్లా..
పంటి కింద రాళ్ళల్లా అలాంటి సీన్లొస్తే..
మా ముసలమ్మ ఒక్కటినేర్చిందేమధ్య...
నే..చెడిపోతున్నా..నే చెడిపోతున్నా..
అని బోసినోటితో నవ్వుతుంది..
Ha..Ha..Ha.., Well said..., Madam...
ReplyDelete