ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ..
పాపం..రాజు అంటే నేను కొత్త పెళ్ళి కొడుకుని..
పెళ్ళవగానే ముచ్చటగా మూడ్రోజుల పండగ ముగించుకొని లీవైపోయిందంటూ..వెళ్ళిపోయాను..
మళ్ళీ నెల్రోజుల తర్వాత..కోటి ఆశలతో పెళ్ళాం కోసం పెళ్ళాం ఊరికి వచ్చాను..
అది..అర్థరాత్రి సమయం..
అత్తింట్లో అందరూ నిద్ర పోతున్నారు..పెళ్ళాం కూడా..
ముద్దులమొగుడు వస్తాడని మేలుకొని వుండద్దూ..?
ఊహూ..పాపం ఇంతసేపు ఎదురుచూసి చూసి పాపం నిద్ర పోయి వుంటుంది..
మేడమీద అందరూ.. పడుకొని వుంటారు..
తలుపు మెల్లిగా..నాక్ చేశా..
ఊహూ..నో రెస్పాన్స్..కాస్త గట్టిగా తట్టా..అబ్బే..
దబ దబా బాదా..అబ్బో..వీళ్ళు కుంభకర్ణుని వంశస్తులేమో..
కింద తలుపు బాదినా విరగ్గొట్టినా వాళ్ళు లేవరు గాక లేవరు..
ఆటో వాడికి డబ్బిచ్చి పది నిమిషాలు హారను కొట్టాడు..
పైనించీ.. ఉలుకూ లేదూ..పలుకూ లేదూ..
నా వంక జాలిగా చూసి ఆ అర్ధరాత్రి నట్టనడి వీధిలో ఏకాకిగా నన్నొదిలేసి ఆటోవాడు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు..
ఏం చేయాలి పైకి కంక్కర్రాళ్ళు విసరాలా..
ఛ.. బాగోదు..మరెలా
ముందురూములోనే నా ప్రేమ దేవత నిద్రించి వుంటుంది..అదిగో కనపడుతోంది..
కాని ప్రేమ దేవతకు ఇంత నిద్రేంటి..అసహ్యంగా..బాగా అలంకరించుకొని నాకోసం..ఎదురు చూడద్దూ.. ఇళ్ళవాళ్ళందరూ..గేట్లకు తాళాలేసుకొని మరీ నిద్ర పోతున్నారు..
ఎంతసేపు రోడ్లో నిలబడనూ..?
మెల్లిగా గేటెక్కా..
ఆపై గోడ..ఎక్కా..
అంతే చీకట్లో అంతవరకే నాకు తెలుసు..
దభీమని చప్పుడైందనుకుంటా..
నా శరీరంలో నడుమో.. వెన్నెముకో..తెలియదు..
అబ్బా ..అబ్బబ్బా.. విరిగిందా..లేక బెణికిందా..
ఇంతలో వీధి కుక్కలు దొంగలు పడిన ఆర్నెల్లకు..మల్లె తమ గళాలను విప్పాయి..
తంతే బూర్లె బుట్టలో పడ్డట్టు నేనెళ్ళి పక్క ఇంటి వాకిట్లో పడ్డానన్నమాట..
వాళ్ళు దొంగనుకొనే ఆవేశంగా వచ్చారు..
తర్వాత నా దీనగాధను విని పైకి వెళ్ళి..ముందుగదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్న నా కొత్త పెళ్ళాన్ని నిద్ర లేపారు..
కాస్సేపటికి నా ఈవ్ కళ్ళు నులుముకుంటూ వచ్చింది..ఆ ఇంటి వాళ్ళు గేటు తాళం తీస్తే..విడుదలైన ఖైదీకి మల్లె బయటికొచ్చా..వెర్రి నవ్వు నవ్వుతూ..
సారీ ..అండీ..ఇంతవరకూ మీ కోసమే ఎదురుచూశా..తెలియకుండానే నిద్ర పట్టేసింది..అంటూ ముద్దుగా..గునిసింది..
వెనకే మా ఆవిడగారి వదినగారు నోరారా నవ్వుతూ బయటికి వచ్చింది.తన తమ్ముడికి అంత మర్యాద జరిగితే ఆవిడకెంత సంతోషం..
ఇక్కడో విషయం మా అత్తగారు పరమపదించి అప్పటికి చాలా యేళ్ళైందిట.
అందుకే నాకంత మర్యాద దక్కింది వాళ్ళింట్లో..
నెమ్మదిగా నొప్పులను కవర్ చేసుకుంటూ అత్తలేని అత్తారింట్లోకి అడుగెట్టా..
ఇదీ నా మొదటి అనుభవం అత్తారింట్లో..ఎలా వుంది బావుందా..మీరెవరూ ఇలాంటి అనుభవం పొంది వుండరు కదూ..
No comments:
Post a Comment