Wednesday, 20 July 2011

ఒరే..శివ శంకర వర ప్రసాదూ..నా మాటినుకోరా అయ్యా..
అమ్మా ఆ అరవిదు లేడూ ..
నాయనా ..చిరంజీవీ..
ఎట్టా వుండేటోడివి..ఎట్టా అయిపోయావురా..అయ్యా....
సినిమాల్లో చక్రం తిప్పినప్పుడు.. నా కొడుకును కొట్టే మగాడే లేడని సంబర పడ్డానే..
అయినా ఎంత పెళ్ళాం కొంగు పట్టుకు తిరిగే కుయ్యా వైతే మాత్రం..బామ్మర్ది చెంగట్టుకు తిరగడమేంట్రా.. జిమ్మడిపోనూ....
ఆడసలే ..మంత్రాల మారిగాడు..నిన్నూ..నీ పార్టీ నీ ముంచేశాడు..
ఒరేయ్..ఎదవా..ఆడి నవ్వు చూస్తే తెలియట్లేదురా..ఆడెంత..దొంగ సచ్చినోడో..నీ తెలివి ఇంత తెల్లారి పోయిందేవిట్రా..దరిద్రపు గొట్టు వెధవా..దరిద్రపుగొట్టు వెధవాని..
కాస్త దొంగ మాటలూ..కాసిని అబధ్ధాలూ..నేర్చుకెళ్ళరా..రాజకీయాలలోకి వెళ్ళే ముందూ..అని చిలక్కు చెప్పి నట్లు చెప్పాను..విని చచ్చావా..నీ శ్రాధ్ధం పెట్టా..
ఆ పెద్దాయన ఇవేవీ చూడకుండానే ..కళ్ళు మూసుకుని వెళ్ళి పోయాడు..పుణ్యాత్ముడు..
నేనింకా ఇక్కడే తగలడ్డాను..ఈ ఘోరాలన్నీ చూసి చచ్చేదానికి..అయ్యో ..దేవుడా..నేనేం చేతురా..
బంగారం లాంటి పార్టీకి అందరూ కలిసి పాడె కట్టేశారే..నా కొడుకును అమాయకుణ్ణి చేసి..

ఒరే ముదనష్టపోడా..ఇంక నన్నా కొంపలో పడి చావు..మళ్ళీ సినిమాలూ ..రాజకీయాలూ అన్నావో ..రెండు కాళ్ళూ విరగ్గొడతా..

No comments:

Post a Comment