Wednesday, 17 August 2011

సినిమాభిమానం


శైలజకు సినిమాల పిచ్చి..
అందునా కమలేష్ సినిమాలంటే ప్రాణమిచ్చేస్తుంది..
అంతటి వీరాభిమాని.
శైలజ అభిమాన హీరో కమలేష్. "ఇదో చరిత్ర" సినిమా ద్వారా తెరమీదకొచ్చాడు.
అప్పుడు శైలజ సరిగ్గా పదహారేళ్ళ వయసులో వుంది.
ఎప్పుడూ..యేవో జోకులూ.. కిల కిలా నవ్వులూ..
అప్పుడా హేరో శైలజకు తెగ నచ్చేశాడు..వుత్తరాల ద్వారా అభిమానాన్ని తెలియజేసింది.
ముద్దు ముద్దు మాటలూ.. అందమైన ముఖంతో  యువతనాకట్టుకున్నాడా హేరో..అప్పట్లో..
డైలాగ్ టు డైలాగ్ అప్పజెప్పేది..
పాటలన్నీ ఇంతో గొప్పగా అనిపించేవి..
ఓసారి..కాలేజీలో ఇవ్రైనా పాట పాడమని మేడం అడిగితే ..ఆ సినిమాలోని ఓ యల్లారీస్వరి కసి పాటని కస కసా పాడేసింది.
అందరూ నవ్వారు..వారితో జతకలిపి తానూ నవ్వేసింది.
తర్వాత..కమలేష్ ఓ సినిమాలో గుడ్డివాడిగా ..నటించాడు..
అద్భుతమైన నటన కనపరిచాడన్నారందరూ..
ఆ పిక్చర్నూ పదిసార్లు వదల్లేదు..
గుడ్డివాళ్ళ గురించి ఆలోచించేది ఆ తర్వాతెప్పుడూ..
చేసుకుంటే తనూ ఓ గుడ్డి వాడిని పెళ్ళాడాలనుకుంది..కూడా అప్పట్లో..
తర్వాత వచ్చింది.. కమలేష్ సినిమా..కదిలే వసంతం..
దానికి కమలేష్ అవార్డ్ అందుకున్నాడు..
ఇక శైలజ సంతోషం చెప్పనలవి కాదు..
ఆ సినిమాని చాలా సార్లు చూసింది..
కాలేజీ రోజుల్లో.. ఎందరో వెంటబడేవాళ్ళు..
కమలేష్ను ప్రేమించేది శైలజ..శైలజ అభిరుచిని తెలుసుకుని కమలేష్లా జులపాలు పెంచుకుని శైలజకు ఐ లవ్యూ చెప్పేవారు కొందరు..పాపమే ఆజీవుడు నీ ఐ లవ్యూ కోసం కుక్కలా తిరగలేక చస్తున్నాడు కాస్త నవ్వవే తల్లీ..అనేవారు స్నేహితులు..
కమలేష్ పెద్ద పోస్టర్ తండ్రికి తెలియకుండా తన బట్టల బీరువాలో అతికించింది..కూడా..
ఆ ఫోటో చూస్తూ..అలా నిద్రపోతే కమలేష్ కలల్లోకొచ్చేవాడు..
డిగ్రీ అవగానే పెళ్ళయింది..
వివేకమూ పెరిగింది..తండ్రి తన తాహతుకు తగ్గట్టు ..ఏ ఇంజనీర్నో.. డాక్టర్నో తీసుకు రాగలడు ..కానీ.. కమలేష్ ని కాదుగా..
కమలేష్ కానప్పుడు.. ఎవరైతే ఏం..? అనుకుని ఓ నిఖిలేష్తో తాళి కట్టించుకుంది..
పెళ్ళయిన కొత్తలో భర్త ముందే కమలేష్ నటనను అందాన్నీ పొగిడేది..
మరో మగాడైతే..ఏర్ష్య పడేవాడు..కానీ..సినిమా యాక్టరే కదా.. అని సరిపెట్టుకున్నాడు..నిఖిలేష్..
పెళ్ళయినా తన అభిమానాన్ని వదల్లేదు శైలజ ..కాస్త పెద్దరికంగా..అతని సినిమాలు లైక్ చేయటం మొదలుపెట్టింది.
అతనూ పెద్దవాడయ్యాడు..కాబట్టి కాస్త మెచ్యూర్డ్ హీరో వేషాలు వెయ్యటం మొదలు పెట్టాడు..
అతని వేషాలూ.. నటనా..
అందులో త్నకు నచ్చినవీ..నచ్చనివీ..నచ్చనివి ఎందుకు నచ్చలేదూ..అతని ధోరణిని ఎలా మార్చుకుంటే బాగుంటుందీ..
ఇలా ఉత్తరాలు రాసేది..జవాబులూ పొదేది..
నిఖిలేష్ ఓ కంపనీ ప్రొడక్షన్ మేనేజరు..
భార్యంటే చాలా ప్రేమ..
ఇద్దరు పిల్లల తల్లయింది శైలజ..వారు వుద్యోగరీత్యా బందరుకు బదిలీ అయ్యారు..
ఓ కాలనీలో అద్దెకు ఇల్లు..
దగ్గరే పిల్లల స్కూలు..సెటిలయ్యాయి..పక్క వాటాలో వుంటున్న సంధ్యకూ శైలజకూ మంచి దోస్తీ కుదిరింది..
అభిప్రాయాలూ .. అభిరుచులూ.. దాదాపు ఒక్కటే..
వెంటనే పిల్లలూ .. మగాళ్ళూ.. కూడా పరిచయాలు కలుపుకున్నారు..
మగాళ్ళూ పిల్లలూ బయటికెళ్ళాక..సంధ్యా శైలజలు షాపింగులూ..మార్నింగ్ షోలూ..కూరగాయలూ..ఊరగాయలూ ..కలిసి చేసుకోవటం మొదలుపెట్టారు..
వీరి స్నేహాన్ని చుట్టుపక్కల వాళ్ళు ఇద్దరు మిత్రులనీ..జంటకవులనీ..ఇంకా యేవో పేర్లతో పిలవటం మొదలు పెట్టారు..కూడా..
సంధ్య భర్త మంచి హోటలులో మేనేజరు..
మూడవ వాటాలోని కామాక్షికి నెలలు దగ్గర పడ్డాయి..మూడవ కాంపు..
సహాయం చేసేవారు ఎవరూ లేక పోవటంతో..దూరపు బంధువులైన సీతారాములనె దంపతులను సహాయానికి పిలిపించుకుంది..
సీతారాములు నిజంగా సీతారాములే..అన్యోన్య దాంపత్యం పైగా సహాయం చేసే మనస్తత్వం..
కామాక్షిని కన్న కూతురిలా చూసుకోవటం మొదలుపెట్టారు.కామాక్షి వారి అభిమానానికి కంటతడి పెట్టేది..
సాయింత్రం వేళ నడక గర్భిణికి మంచిదని సీతమ్మ గుడికి కూడా తీసుకు వెళ్ళి తీసుకు వచ్చేది జాగ్రత్తగా..
పనిమనిషి సాయం వున్నా.. సీతమ్మ కామాక్షిని పనిలోకి రానిచ్చేది కాదు. కమ్మగా వండిపెట్టేది..
కామాక్షి పిల్లలకు చక్కటి కథలూ ..పురాణాలూ..సరదా పజిల్సూ .. చెప్పేవాడు రామయ్య..
కూరలు తేవటం పిల్లల్ని స్కూల్లో దిగబెట్టటం ..తిరిగి ఇంటికి తేవటం కూడా నెత్తిన వేసుకున్నాడు.
మీకెందుకు శ్రమ బాబాయ్ ..అంటే..
సరేలేవమ్మా..ఊరికే తిని కూచుని ..రోగాల బారిన పడమంటావా..?
అనేవాడు వేళాకోళంగా..

సీతారాములు సంధ్యా శైలజలతో..ముచ్చట్లు పెట్టుకునేవారు అప్పుడప్పుడూ..
ఆనాటి తమ సంగతులను తమాషాగా గుర్తుచేసుకొనేవారు..

ఓసారి సీతమ్మ సరదాగా..పూలు అడిగిందని ..రామయ్య బాబాయ్ రోజూ పూలు తేవటం మొదలుపెట్టాడు..వద్దంటే బాధపడతారేమోనని సంకోచం..
రోజూ కొత్త పెళ్ళి కూతురిలా ఇన్నిన్ని పూలు తురుముకుంటే నలుగురూ ముసిముసిగా నవ్వేవారు..
పైగా ..పూలుపెట్టుకోమని అందరిలో .. పదే పదే ..గుర్తు చెసేవాడు..
ఇక పూలు చాలని నలుగురిలో సిగ్గుగా వుందనీ చెబితే ..
ఎగతాళి చేయనీవోయ్..నీవూ నేను..మొగుడూ పెళ్ళాలమేగా..ఏ లవర్సో కాదుగా..చాటుమాటు సరసం అంతకన్నా కాదు..
మనల్ని చూసి దంపతులెలా వుండాలో ..నేర్చుకుంటారు..ఈనాటి కుర్రకారు..
అనేవాడు ధీమాగా..
సీతమ్మ పిన్ని సిగ్గుపడ్తూ చెప్తూంటే..వారి అన్యోన్యతకు సంతోషంగా..చూడముచ్చటగా.. అనిపించేది..

సంధ్య భర్త శ్రీధర్ పనిచేసే హోటల్ లో హేరో కమలేష్ ఏదో షూటింగ్ కోసమై దిగాడనీ .. కొద్దిరోజులు వుంటాడనీ..భార్యకు చెప్పాడు..
ఆ విషయం శైలజకు కమలేష్ అంటే అభిమానమని తెలిసిన సంధ్య శైలజ చెవినేసింది ..
ఇక శైలజ ఆనందం పట్టలేక పోయింది..
అతనిపై తన అభిమానం ఎలా మొదలైంది..? అతని సినిమాలు తనకెంతగా నచ్చిందీ..ప్రవాహంలా చెప్పడం మొదలు పెట్టింది..
ఓపిగ్గా వింది సంధ్య..

సంధ్యా..నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళవే అంది బ్రతిమాలుతూ..
తప్పకుండా.. మావారికి నేనెప్పుడో చెప్పాను ఈ విషయం అంది..
ఇద్దరమే వెళితే యేం బాగుంటుందీ ..? పెద్దవాళ్ళు కనుక సీతమ్మ పిన్నీ.. బాబాయ్లనూ ..తీసుకు వెళదాం..అంది..
సీతమ్మ పిన్ని ఎందుకమ్మా..? వాళ్ళ దగ్గరికి.. వాళ్ళేం ప్రత్యేకమైన మనుషులు కాదు మనలాంటి వాళ్ళే..!!
వాళ్ళ నటనను అభిమానించండి..కానీ ..వారిని కాదు..అంది..
కానీ పిల్లలు చిన్న బుచ్చుకుంటారేమో ననుకుని వస్తానంది..
మరుసటిరోజు శ్రీధర్ కారుపంపాడు..
అందులో సంధ్యా శైలజ సీతమ్మ పిన్నీ రామయ్య బాబాయ్లు బయలుదేరారు..

శైలజ చిన్న కొడుకు అమ్మవాళ్ళు ఎక్కడో వెళ్తున్నారని పసికట్టి ..స్కూలుకు నామంపెట్టి వెంటబడి వచ్చాడు మొండిచేసి..
అందరూ పోలోమంటూ హోటలు చేరారు..
కమలేష్ విశ్రాంతి తీసుకుంటున్నాడు..
అభిమానులనగానే ఇబ్బందిగా వున్నా రమ్మనక తప్పలేదు..
సోఫాలో కూచున్నారు అందరూ..

ఎవ్వరూ మాట్లాడలేదు.. ముందుగా ..
సంధ్యకు మొహమాటంగా..శైలజకు ఉద్విగ్నంగా..
సీతమ్మ రామయ్య లకు చాలా మామూలుగా వుంది..

శైలజ కొడుకు మాత్రం అంకుల్ మీరు సినిమాలో ..విలన్ ను డిష్యూం ..డిష్యూం..అని కాలుస్తారుగా..నిజంగా చచ్చిపోతాడా..?
పైనుంచీ జంప్ చేస్తారుగా దెబ్బలు తగలవా..?
ఎందుకందుల్ హేరోయిన్ తో డ్యాన్సులు ..బోర్ కొట్టదూ..?
అని బోలెడు తన సందేహాలను వరుసగా వదలడం మొదలుపెట్టాడు..

ఒరేయ్ ..వుండరా..ఒరేయ్ ..ఆగరా..అని వాడినోరు మూసి..శైలజ అతి ప్రయత్నం మీద మీరంటే నాకు చాలా అభిమానమండీ..
మీ సినిమాలు మొదటినుంచీ చూస్తున్నాను..
మీకు ఉత్తరాలు కూడా రాసాను.. అని గొంతు పెగుల్చుకుంది..

రామయ్య బాబాయ్ బాబూ...మేదే గ్రామం ఓహో .. పులిపాకా..స్వస్థలమా..లేక ఉద్యోగనిమిత్తమై వచ్చారా..?
మీ తండ్రిగారిదేం వృత్తీ..? అనీ..
సీతమ్మ పిన్ని..పెళ్ళైందా..? పిల్లలెంతమందీ ..? అనీ అతన్ని పలకరించారు..
సంధ్య కొత్త సినిమాలేంటండీ..? అని మాత్రం అడిగి ఊరుకుంది..

శైలజ మళ్ళీ మీరు నా ఉత్తరాలకు జవబులు కూడా రాసారు.. వాటిని ఇప్పటివరకూ జాగ్రత్తగా.. దాచుకున్నాను .. అంది..
మిమ్మల్నే నా ప్రాణంగా భావించాను అని అనాలనుకుంది.. కానీ అనలేక పోయింది.. సంకోచంతో..
కాఫీలు వచ్చాయి.. తాగారు..

శైలజ కొడుక్కు అతను ఏదో బహుమతి ఇచ్చాడు..గుర్తుగా..
అతను శైలజ నలుగురిలో పూర్తిగా మాట్లాడలేక పోతోందని తనకెదురైన ఉద్విగ్నంలో ఎటూ తోచక వుందనీ గమనించాడు.

ఇలాంటి అభిమానులు అతనికి కొత్తకాదు..
కాసేపటికి అందరూ లేచారు..బయటపడ్డారు..
అయిష్టంగా లేచింది శైలజ.. శైలజ కొడుకు తన వాగుడుతో హేరో కమలేష్ ను జీరో చేసేసాడు..
ఇంటికి చేరినా.. అతన్ని మర్చిపోలేక పోయింది శైలజ..

రాత్రి వచ్చిన నిఖిలేష్ కు హోటల్ కు వెళ్ళామని చెప్పింది...
అతనేం ఆసక్తి చూపించలేదు..అలాగా అన్నాడంతే..

ఏంటండీ మీరు..? హేరో కమలేష్ దగ్గరికి వెళ్ళి వచ్చానని చెబిటే .. ఆసక్తి చూపించరు..?
మీకు నేనంటే ప్రేమే లేదు.. అంది నిరాశగా శైలజ..
పోవోయ్ అలసిపోయి వచ్చాను..నీ అభ్మాన హేరో కనుక నీకు ఇంట్రస్ట్..నేవే నా అబిమాన హేరోయ్న్ వి .. త్వరగా లైటార్పి రా.. అన్నాడు.. తమాషాగా..

రేపు రండి .. మీరూ నేనూ.. వెళదాం..నాకతనితో ఇంకా చాలా మాట్లాడాలనివుంది.. బాబాయ్ వెళదాం .. వెళదాం.. అని తొందరపెట్టి తెచ్చేశారు అని అడిగింది..
రేపా.. అస్సలు కుదరదు.. బోర్డ్ మీటింగ్ వుంది..చూడూ .. ఇద్దరు పిల్లల తల్లివైనా ఈ పిచ్చేంటి నీకు..?
నేను నీ హేరోను కానూ..? రావోయ్..రా..రా..అన్నాడు..

పొద్దున సంధ్యను కదిపిటేఅ మళ్ళీనా.. బాబోయ్ ..మొదటిసారికే ఏం మాట్లాడాలో తెలియక చచ్చాననుకో ..అంది..
సీతమ్మ .. బాబాయ్లతో చెప్పీ వేస్టనుకుంది..
తనే ఒంటరిగా వెళితే సంకోచముండదు అనుకొని వంటరిగా ..బయలు దేరింది..

అరగంట తర్వాత..అటుగా వచ్చిన సంధ్య..శైలజ ఇంటి తాళం చూసి..సీతమ్మకు విషయం చెప్పింది..
బాబాయ్ కూడా విన్నాడు..
ఏంటమ్మా..ఈ పిల్ల ..? బొత్తిగా భయమూ .. భక్తీ.. లేకుండా..
ఆ సినిమా వాడి దగ్గరికి వంటరిగా వెళుతుందా..?
బుధ్ధుండే వాళ్ళు చేసే పనేనా ఇది..అంటూనే ఆటోని పిలిచి బయల్దేరాడు..

హోటల్ చేరిన శైలజ సంధ్య భర్త వుంటాదేమో ఎలారా.. అనుకుని గాభరా పడింది.. అతను కౌంటర్ లో లేడు..
అమ్మయ్య .. అనుకుని సరాసరి కమలేష్ రూముకెళ్ళి తలుపు తట్టింది..

షూటింగ్ క్యాన్సిల్ అయి అతను రూం లోనే వున్నాడు..
తలుపు తెరిచి ఆశ్చర్య పడ్డాడు..వెనకెవరన్నా వున్నారా.. అని తొంగి చూశాడు..
వంటరిగా వచ్చిందా..? అభిమానం ఇంత పని చేయిస్తుందా..?
అని అతనే నోరు తెరిచాడు..కూడా..

నేనేనండీ..మీతో మాట్లాడుదామనీ.. 
రండి.. రండి.. నేను నిన్ననే అనుకున్నా .. మిమ్మల్ని చూసి.. వాళ్ళ ఎదుట మీరు సరిగా మాట్లాడలేక పోతున్నారని..ఇవ్వాళ మీరే వచ్చారు..ఏమైనా తీసుకుంటారా..? మర్యాద చేసాడు..

వద్దండీ .. మీరంటే నాకు చాలా అభిమానమండీ..

నాకు తెలుసండీ..నా చిన్నతనం నుంచీ నేనూ రామారావ్ గారి సినిమాలు తెగ చూసేవాడిని అనుకరించేవాడిని.. ఆయనలా అవ్వాలని ..కలలుకనేవాడిని .. చివరికిలా అయ్యాననుకోండీ..

కదిలే వసంతం..లో హేరోయిన్ కోసం మీరు పడే ఆరాటం నన్ను కదిలించింది..ఆనాటి రోజులలోకి వెళ్ళి పోయింది శైలజ..

వున్నట్టుండి..ఏడవడం మొదలు పెట్టింది..

పక్కనే కూచున్నాడు కమలేష్ భుజంపై చెయ్యి వేశాడు..

అనునయంగా కూల్ డ్రింక్ తాగండి ముందు..అని బలవంతం చేశాడు..

గుడ్డివాడిగా చేశారు..అది నటనలా నేననుకోలేదు.. రియల్ రియలండీ.. 

ఏడుపు మరింత ఎక్కువైంది.. కూల్ డ్రింక్ సగం తాగింది..

ఇదో చరిత్ర .. మీ తొలి చిత్రం ఆ అందం .. అమాయకత్వం.. ప్రేమ చివరికి  మీరు చనిపోవటం నేను భరించలేక పోయాను ..నేను భరించలేక పోయాను..

కూల్ డ్రింక్ పూర్తిగా తాగించాడు.. అనునయంగా..

అతనూ ఆమెను అభిమానిగా.. తన లవర్ గా ...అనుభూతి చెందాడు.. 

ఆమె అభిమానం అతన్ని అలా అనుకొనేలా చేసింది..

ఆమె పమిటపై చేయివేశాడు ప్రేమ మత్తులో.. శైలజ తల అతని గుండెలపై ఆనించింది..

టక్కున శైలజకు స్పృహ వచ్చింది..ఇహలోకంలోకొచ్చింది..
తన శీలం .. అది తన భర్తకే సొంతం..
ఇదేమిటీ..నేనితనికింత దగ్గరగా వచ్చానూ.. అరె ..గుండెలపై తల ఆనించాను..దూరం జరిగింది శైలజ..

అంతే.. అతని అహం దెబ్బ తింది..
ఆమెను వదల్లేదు..అతనిలోని నటుదు వెనక్కి వెళ్ళి పోయి మామూలు మనిషి ముందుకొచ్చాడు.. 
విదిలించుకుంది శైలజ..
పర్వాలేదు రా.. శైలూ..నేను నీ అభిమాన హేరోను..

కానీ.. కానీ...నేనలాంటిదాన్ని కాను..


నీవు నన్ను ప్రేమించావ్.. అభిమానించావ్.. ఆరాధించావ్.. నువ్వు నాదానివి..శైలూ.. రా...
కానీ అది కేవలం అభిమానం మాత్రమే.. దానికి కల్మషం లేదు..శారీరక వాంచ్చ లేదు..అది పూర్తిగా మానసిక మైంది..

కానీ.. నీవు నా కోసం వంటరిగా వచ్చావ్.. నీకు నా పొందు కావాలి..

అపధ్ధం.. ఇలా రావట్మ్ .. నా మూర్ఖత్వం..నెవు మామూలు మనిషి వన్నది నేనూహించలేని సత్యం .. నన్ను వదులు..నేను వెళ్ళాలి..

వదలటమా.. అది జరుగుతుందా..??
వికటంగా నవ్వాడు కమలేష్..
గట్టిగా అరవలేని పరిస్థితి శైలజది..పరువు పోతుంది..

ఇంతలో ఠక్..ఠక్..
తలుపు చప్పుడు..
ఇప్పుడెవర్రా బాబూ..
తలుపు తీసాడు..

వెంటనే రామయ్య బాబాయ్ లోపల దూరాడు..మాట్లాడావామ్మా..అభిమాన హేరోతో.. ఇక వెళ్దామా..నడు మరి..

బాబాయ్ వెనగ్గా రూము బయటికి పారిపోయింది శైలజ..

రోజులు బాగా లేవు బాబూ.. పిచ్చీల్ల అభిమానినంటుంది.. డిస్టర్బ్ చేసాననుకుంటా..వుంటా బాబూ..చేతులు జోడించి బయటకు నడిచాడు.. రామయ్య బాబాయ్..

No comments:

Post a Comment