Sunday, 29 May 2011


త్వరగా ఆఫీసు నుంచీ ..ఇంటికెళ్ళి..అర్జంటుగా యోగాసనాలూ..ప్రాణాయామం..ఇంకా..ధ్యానం చేసేయాలి..
ఇంటికొచ్చాను..అలవాటుగా .. పనిమనిషి డుమ్మా..చేసేదేముంది..ఆ నాలుగూ కానిచ్చేసి..
ఆదరా..బాదరా..స్నానాలు కానిచ్చేసి..యోగాకు రెఢీ..అయిపోయాను..
మొదటగా..ఆసనాలు..వజ్రాసనం..ఆ ఆసనం ..ఈ ఆసనం..
నీవు నీళ్ళు బాటిల్స్ లో నింపు..
నీవే నింపు..
ఎందుకమ్మా..అన్ని కష్టమైన పనులు నాకిచ్చి ఈజీ పనులు నీవు చేస్తావా..నేనే బాటిల్స్ నింపుతా.. నీవు..బట్టలారేయ్..
చూడమ్మా..నేను చిన్న పిల్లని..
అబ్బ చా..
ఈ రోజు పనిమనిషి రాలేదు..సిరీ నీవు ఇల్లు చిమ్ము వాడు ఆ కట్టె తో ఇల్లు తుడుస్తాడు..నేను యోగం మధ్యలోనుంచీ అరిచాను..
ఆ..చూడు ..నేను ఇల్లు చిమ్మాలి..బాటిల్స్ నింపాలి ..బట్టలారేయటంలో సహాయం చేయాలి..
వాడు మాత్రం..తుడవటమొక్కటే..నేనస్సలు చెయ్యను..
వాణ్ణి..ఇల్లు చిమ్మమను..
వాడు మగపిల్లవాడు..వాడికి రాదు..నీవే చిమ్ము..
మళ్ళే నేను యోగం మధ్యలోనించీ గావు కేక పెట్టాను..
ఆ చూశావా నాన్నా..వాడు మగ పిల్లాడు..
నేను నిదానంగా ఊపిరి తీస్తున్నాను..వదులుతున్నాను..
అది ఊడవటం మొదలు పెట్టింది..
ఇంతలో ఆయన రంగప్రవేశం చేసినట్లున్నారు..
అక్కడ దుమ్ము పోలేదు..
నీవు ఓవర్ చేయకు నాన్నా..
ఏయ్..ఇక్కడ చూడవే..ఈ మూలకు..
అమ్మా.. అది కీచుమని అరిచింది..ముందు నాన్నను ఇక్కణ్ణుంచీ పొమ్మను..అప్పుడేఅ ఊడుస్తా..
నా ముందుకొచ్చి నిలబడింది..
నేను కళ్ళు తెరవక తప్పలేదు..దాని పని అది చేస్తుంటే మీరెందుకు..
మధ్యలో ..అరవక తప్పలేదు మళ్ళీ..

అది మళ్ళీ వెళ్ళింది..ఊడవడానికి..
ఇక్కడివ్వవే..కిచనులో ఇంత చెత్త పెట్టుకొని వదిలేసింది..ఆయన చీపురు లాక్కొని కిచనులోని చెత్తను లాక్కొచ్చారు..
కిచనులో తడిగా లేదా నాన్నా..చీపురు పాడై పోదా..
వాడు క్యారెట్ తింటూ చోద్యం చూస్తున్నాడు..ఆనందంగా..
పూరకం..రేచకం..కుంభకం..శూన్యకం..
పూరకం...రేచకం....కుంభకం..శూన్యకం...
ఇంక నీవు వెళ్ళి తుడువు..
వెళతాలే..నీవెందుకూ ..చెప్పేది..అమ్మా..దాన్ని ఊరికే ఉండమను..
నేను చిన్ముద్ర..చిన్మయ ముద్ర..ఆది ముద్ర..
ఇక..ధ్యానం..
ఊపిరి పైనే..ధ్యానం..మెల్లిగా..ఊపిరి పీల్చూ..వదులూ..పీల్చూ..వదులూ..
నెమ్మదిగా..నెమ్మదిగా..తలంతా మైకం కమ్మినట్లవుతూంది..
కళ్ళు తెరవాలన్నా..తెరవలేక పోతున్నాను..
మత్తుగా..హాయిగా....ఆనందంగా..సుఖంగా..
ఇదే..ధ్యానమా..ఇలా చేస్తే..అన్ని వ్యాధులూ..పోతాయా..అప్పుడప్పుడూ..ఆలోచనలు..అలల్లా వస్తున్నాయి..వెళుతున్నాయి..
వస్తున్నాయి..వెళుతున్నాయి..
ఇలా గంటసేపైనా..ఉం..డ..వ.......చ్చు.............క.........దా.............
అమ్మా........................
బలవంతంగా..కనులను తెరవాల్సి వచ్చింది..
ఎందుకంటే..
నాచిన్న కొడుకు..ఇల్లంతా..నీటి మయం చేశాడు..కాబట్టి..
ఒక పక్క తడి మరో పక్క పొడి..
అఘాయిత్యంగా తన పని కానిచ్చి..ఉక్రోషంగా..చూస్తున్నాడు..టి.వి...
ఏం..పనిరా..ఇది..
ఈ పనులు ఆయనో ..నేనో ..చేసుకొనే..వాళ్ళం..
కానీ పిల్లలకు ...పని అలవాటు కావాలని..ఇదిగో ఇలా..






Monday, 23 May 2011

యోగాన్ని నేర్చుకుంటున్న పిల్లలు





మా అక్కయ్య కూతురు సిధ్ధ సమాధి యోగాలో పదేళ్ళనించీ వుంటోంది..
ఆస్తమా అటాక్ అయిందామె టీనేజ్ లో..
అప్పటినుంచీ యోగాలో వాళ్ళ ఫామిలీ ..ఫామిలీ..అంతా..సెటిలైపోయారు..





మొదలు మైండులో రక్త ప్రసరణ లేదన్నారట..తరువాత మెదడులో క్యాన్సరన్నారట..చివరికి అది ఆస్ఠమాగా తేలింది..

బ్రతకనే బ్రతకదన్న పిల్ల ఇద్దరు బిడ్డల తల్లై ..చక్కగా ఉద్యోగం

చేసుకుంటూంది..ప్రాణాయామం ..ఆసనాలు..ఆమె జీవితాన్ని ..నిలిపాయి మరి..





రా.. అక్కా.. మా యోగ కాంప్ కని తీసికెళ్ళింది..
ఆ రోజు చివరి రోజుట..
పది రోజులూ పిల్లలను వాళ్ళ దగ్గరే పెట్టుకొని 5 గంటలకే నిద్ర లేపటం యోగా ప్రాణాయామా ఆసనాలు ధ్యానం చేయించటం..
పాటలు డ్యాన్సులు..చేయించటం మంచి విలువలని బోధించటం..తల్లి దండ్రుల విలువని రక్త సంబంధాల ప్రాముఖ్యతనీ వివరించటం.. చేసారట..


ఇంకా.. ఏకాగ్రతని పెంచుకోవటం ఎలా..
గమ్యాన్ని ఏర్పరచుకోవటమెలా..
ఆ గమ్యానికి చేరడానికి ఎలాంటి ప్రణాళిక మనకనుకూలమైన రీతిలో రచించుకోవాలి ..ఇలా ఎన్నో...
మనం ఇలాంటివి పిల్లలకు బోధించలేం..
ఒకవేళ చెప్పినా ..వినరు..
ముందు మనమలా లేము కదా..



దీపావళి హోళీ ఎన్నో పండుగలు పిల్లలతో చేయించారట..
చివరి రోజు పిల్లలతో తల్లి దండ్రులకు పాద పూజ చేయించారు..
పూజకు కావల్సిన సరంజామాతో ..మేము అక్కడికి చేరుకున్నాం..
పది రోజులు తల్లి దండ్రులను వదిలి వున్న పిల్లలు వారి రాకకై కళ్ళలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదేమో..
వాళ్ళను చూడగానే పరుగు పరుగున వచ్చి ..కళ్ళలో నీళ్ళు కారిపోతుండగా..వాటేసుకోవటం..నాకైతే ఆ తల్లీ పిల్లలను చూసి హృదయం ద్రవించిపోయింది..


మైకులో వేదాలు వినబడుతున్నాయి..
ఇక..పాద పూజ ఆ పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులతో ..తల్లి దండ్రులకు మైకులో వినబడుతున్న సూచనల ప్రకారం తల్లి దండ్రుల పాదాలను  పూలతో పూజించారు..
ఒక పక్క తల్లి దండ్రులు ఇదే కదా మన సంస్కృతి అని ..కండ్లు చెమర్చు కుంటున్నారు..
తల్లి దండ్రులకు పూల మాలలు వేసారు.. పాద తీర్థాన్ని పిల్లలు తమ తలలపై చల్లు కున్నారు..


ఆ తరువాత పిల్లలు ఆ క్యాంప్ పై తమ అభిప్రాయాలను తాము పొందిన అనుభూతులను.. తాము నేర్చుకున్న విషయాలను అందరూ ఆశ్చర్య పోయే విధంగా వివరించారు..


చక్కటి భోజనాలు.. వానిలో కొన్ని పచ్చి కూరగాయలు..జ్యూసులు..మంచి అలవాట్లు..
మంచి బోధనలు .. వీనిని మనం మన పిల్లలకు అందివ్వ గలమా..?
అందుకే..ఏ క్యాంప్ నాకు బాగా నచ్చింది..
మీకెలా వుందో చెప్తారుకదూ..!!!






Sunday, 8 May 2011

మ్ము..మ్ము..మ్ము..ద్దంటే..


సినిమాలూ..చెట్టు చాటు సీన్లు..
హమ్మయ్య..నేనేం చెప్పదల్చుకున్నానో.. కనిపెట్టేశారా..
సినిమాలో పాటల్లో అప్పుడప్పుడూ..హీరో హీరోయిన్లు..ఓ నిమిషం పాటు చెట్టు చాటుకు వెళ్ళిపోతుంటారు..రెండు జంట పువ్వులు తెరకు అడ్డం పడేవి..
ఓ నిమిషం తర్వాత..ఆ అమ్మాయేమో మూతి తుడుచుకుంటూ..సిగ్గుపడుతూ..బయటికి వస్తుంది..ఆ అబ్బాయేమో ఏదో ఘన కార్యం చేసిన వాడిలా దరహాసం చిందిస్తూ..కూడా వస్తాడు..
గుర్తొచ్చిందా..గుర్తొచ్చిందా..
ఎప్పుడైనా సినిమాల్లో ఆ సీన్లు వస్తే ఇక మేము చచ్చామే..మా అక్కయ్య మా వేపు గాభరాగా..చూసి ..పెద్దవైన తన కళ్ళను మరింత పెద్దవిగా చేసి అన్నీ..చూసి చస్తారు..అని గదమాయిస్తుంది..
సినిమాలో మేము అందుకనే మా అక్కయ్య పక్కన లేకుండా..కాస్త దూరంగా కూచునే వాళ్ళం ..
అలాంటి సీను వస్తుందంటేనే గుండెల్లో భయం పుట్టేది..
ఇక ఈ కాలంలో ..
చెట్లూ..పూవులూ మనం మన మొహాలకు అడ్డం పెట్టుకొని కూచోవాల్సిన పరిస్థితి వచ్చింది..
ఆ ఎదవ సీన్లన్నీ చూసి పిల్లలు ఎక్కడ చెడిపోతారోనని ..మనం హడలి చావాలే..గానీ ..వాళ్ళు అన్నిటికీ అలవాటు పడిపోయారు..హాలీవుడ్ సినిమాలకు దీటుగా మన సినిమాలు అలరారుతున్నాయివ్వాళ..
అల్లాంటి సీన్లొస్తే..పిల్లలే గబుక్కున చానల్ మార్చి వారి పరి పక్వతని చాటుకుంటున్నారు..మనం చెడిపోకుండా..ఆరిందాల్లా..
పంటి కింద రాళ్ళల్లా అలాంటి సీన్లొస్తే..
మా ముసలమ్మ ఒక్కటినేర్చిందేమధ్య...
నే..చెడిపోతున్నా..నే చెడిపోతున్నా..
అని బోసినోటితో నవ్వుతుంది..







Friday, 6 May 2011




నా బ్లాగులో స్లయిడ్ షో మార్చుకుందామని అనుకున్నా..
ఇంతవరకూ మీరబాయిని వుండనిచ్చా..
ఇక మీరాబాయమ్మను పంపించి ఇంకెవరినన్నా ఇన్వయిట్ చేద్దమని డిజైన్లోకెళ్ళి బాపు ఆర్ట్ గాలర్య్ అన్నా..ఊహూ..అరగంట కాస్త తొరగా.. చేసి చావవే.. అని ఎంటర్ కొట్టి కంప్యూటర్ను కోప్పడ్డా ..ఇదసలు చెప్పిన మాట విని చస్తే లోకమిలా యెందుకు తగలడుతుందని ..ఈసారి మహాత్మా గాంధీ అని కొట్టా ..మళ్ళీ ..అరగంట..ఎంటర్ కొడితే లోడ్ అవుతున్నా నంటూ..కయ్యి మంటుంది..
ఇలా కాదని ఇండిపెండెన్స్ రెవల్యుషన్ ఫోటోస్ అని రూట్ మారుద్దామనుకున్నా..
మళ్ళీ..అరగంట..ఏమంటే లోడ్ అవుతున్నా నంటూ కవరింగొకటి..
దీని వెధవ్వేషాలు ఇలా వున్నాయా అనుకొని బ్రహ్మానందం అని కొట్టా..ఇక చూస్కొండీ కంప్యూటర్ ఆనందానికి అడ్డూ..ఆపూ..లేకుండా..పోయింది..
దీనిదుంపతెగ..సరిగ్గా..ఒక్క సెకెనులో మన బ్రహ్మానందం ప్రత్యక్ష మయ్యాడు..
ఇంకేం చెప్పమంటారు నన్నూ..

Wednesday, 4 May 2011

లేఖిని నాది మాటలు మనసువి: ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.. పాపం..రాజు అంటే నేను కొత...

లేఖిని నాది మాటలు మనసువి:

ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ..
పాపం..రాజు అంటే నేను కొత...
: "ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ.. పాపం..రాజు అంటే నేను కొత్త పెళ్ళి కొడుకుని.. పెళ్ళవగానే ముచ్చటగా మూడ్రోజుల పండగ ముగించుకొని లీవైపోయిందంటూ..వెళ్ళ..."

Monday, 2 May 2011



ఇలాంటిదే ఇంకో ఇస్టోరీ..
పాపం..రాజు అంటే నేను కొత్త పెళ్ళి కొడుకుని..
పెళ్ళవగానే ముచ్చటగా మూడ్రోజుల పండగ ముగించుకొని లీవైపోయిందంటూ..వెళ్ళిపోయాను..
మళ్ళీ నెల్రోజుల తర్వాత..కోటి ఆశలతో పెళ్ళాం కోసం పెళ్ళాం ఊరికి వచ్చాను..
అది..అర్థరాత్రి సమయం..
అత్తింట్లో అందరూ నిద్ర పోతున్నారు..పెళ్ళాం కూడా..
ముద్దులమొగుడు వస్తాడని మేలుకొని వుండద్దూ..?
ఊహూ..పాపం ఇంతసేపు ఎదురుచూసి చూసి పాపం నిద్ర పోయి వుంటుంది..
మేడమీద అందరూ.. పడుకొని వుంటారు..
తలుపు మెల్లిగా..నాక్ చేశా..
ఊహూ..నో రెస్పాన్స్..కాస్త గట్టిగా తట్టా..అబ్బే..
దబ దబా బాదా..అబ్బో..వీళ్ళు కుంభకర్ణుని వంశస్తులేమో..
కింద తలుపు బాదినా విరగ్గొట్టినా వాళ్ళు లేవరు గాక లేవరు..
ఆటో వాడికి డబ్బిచ్చి పది నిమిషాలు హారను కొట్టాడు..
పైనించీ.. ఉలుకూ లేదూ..పలుకూ లేదూ..
నా వంక జాలిగా చూసి ఆ అర్ధరాత్రి నట్టనడి వీధిలో ఏకాకిగా నన్నొదిలేసి ఆటోవాడు నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయాడు..
ఏం చేయాలి పైకి కంక్కర్రాళ్ళు విసరాలా..
ఛ.. బాగోదు..మరెలా
ముందురూములోనే నా ప్రేమ దేవత నిద్రించి వుంటుంది..అదిగో కనపడుతోంది..
కాని ప్రేమ దేవతకు ఇంత నిద్రేంటి..అసహ్యంగా..బాగా అలంకరించుకొని నాకోసం..ఎదురు చూడద్దూ.. ఇళ్ళవాళ్ళందరూ..గేట్లకు తాళాలేసుకొని మరీ నిద్ర పోతున్నారు..
ఎంతసేపు రోడ్లో నిలబడనూ..?
మెల్లిగా గేటెక్కా..
ఆపై గోడ..ఎక్కా..
అంతే చీకట్లో అంతవరకే నాకు తెలుసు..
దభీమని చప్పుడైందనుకుంటా..
నా శరీరంలో నడుమో.. వెన్నెముకో..తెలియదు..
అబ్బా ..అబ్బబ్బా.. విరిగిందా..లేక బెణికిందా..
ఇంతలో వీధి కుక్కలు దొంగలు పడిన ఆర్నెల్లకు..మల్లె తమ గళాలను  విప్పాయి..
తంతే బూర్లె బుట్టలో పడ్డట్టు నేనెళ్ళి పక్క ఇంటి వాకిట్లో పడ్డానన్నమాట..
వాళ్ళు దొంగనుకొనే ఆవేశంగా వచ్చారు..
తర్వాత నా దీనగాధను విని పైకి వెళ్ళి..ముందుగదిలో గుర్రు పెట్టి నిద్రపోతున్న నా కొత్త పెళ్ళాన్ని నిద్ర లేపారు..
కాస్సేపటికి నా ఈవ్ కళ్ళు నులుముకుంటూ వచ్చింది..ఆ ఇంటి వాళ్ళు గేటు తాళం తీస్తే..విడుదలైన ఖైదీకి మల్లె బయటికొచ్చా..వెర్రి నవ్వు నవ్వుతూ..
సారీ ..అండీ..ఇంతవరకూ మీ కోసమే ఎదురుచూశా..తెలియకుండానే నిద్ర పట్టేసింది..అంటూ ముద్దుగా..గునిసింది..
వెనకే మా ఆవిడగారి వదినగారు నోరారా నవ్వుతూ బయటికి వచ్చింది.తన తమ్ముడికి అంత మర్యాద జరిగితే ఆవిడకెంత సంతోషం..
ఇక్కడో విషయం మా అత్తగారు పరమపదించి అప్పటికి చాలా యేళ్ళైందిట.
అందుకే నాకంత మర్యాద దక్కింది వాళ్ళింట్లో..
నెమ్మదిగా నొప్పులను కవర్ చేసుకుంటూ అత్తలేని అత్తారింట్లోకి అడుగెట్టా..
ఇదీ నా మొదటి అనుభవం అత్తారింట్లో..ఎలా వుంది బావుందా..మీరెవరూ ఇలాంటి అనుభవం పొంది వుండరు కదూ..







Sunday, 1 May 2011





సత్యసాయి బాబాను నేను నా చిన్నప్పుడు..మా అయ్య (పుట్టపర్తి నారాయణా చర్యులు)తో వెళ్ళి చూసాను..
ఒక ప్రైవేట్ రూములో కింద బాబా మా అయ్యా నేను కూచున్నాము..
ఏమేమో మాట్లాడారు ఇద్దరూ..నా కప్పుడు ఎనిమిది ఏళ్ళుంటాయేమో..
మా అయ్య ముప్పయి ఐదు కోట్ల జపం నారాయణ మంత్రం చేసారు..ఎవ్వరినైనా నాకు కృష్ణ దర్శనమవుతుందా..లేదా..చెప్పు అని అడిగేవారు..
ఆయననూ అలానే అడిగారు..మా అయ్య గొప్ప విద్వాంసుడు..
అందరూ నాకు ధనము కావాలి కీర్తి కావాలి అని అడుగుతారు..
కానీ మా నాన్న ఏరోజూ వానికి విలువ ఇవ్వలేదు..
నేను చిన్నపిల్లను..దాదాపు అరగంట సంభాషణ గడిచింది..
నన్ను పాట పాడమన్నారు మా అయ్య..


కడకు మిగిలేది ..ఇది ఒకటే..
ఎడద జపించిన భగవన్నామము..


అని నా చిన్న గొంతుతో..తాళం వేస్తూ.. పాడాను..
బాబా నన్ను ఆశీర్వదించారు..