Saturday, 12 October 2013
Monday, 30 September 2013
ఆఖరి బంతి
ఆఖరి బంతి ఎప్పుడో యేమో..
టెన్షన్ తో నరాలు చిట్లి పోతున్నాయి
ఆఖరు పడితేగానీ మ్యాచ్ పూర్తవదు ఏమైనా జరగచ్చు
ఆఖరి బంతి వరకూ ఆడతా అంటాడు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల స్టార్ బాట్స్ మాన్ ముఖ్యమంత్రి కిరణ్
మ్యాచ్ ఎప్పుడో ముగిసింది అంటారు తెలంగాణ వాదులు
ఆటముగిసింది ఆడుడుండదు అంటారు మన కేసీయార్
ఆఖరు బంతి దాకా చూడటమెందుకు
విభజనను అడ్డుకోడానికి అంటారు వైయస్సార్ వాళ్ళు
సిక్స్ కొట్టినా గెలవలేవు అంటారు మన కోదండరాం
మాకు 132 పరుగుల అధిక్యం అంటున్నారు హరీశ్ రావు
బాల్ లేదూ అంటూ కెవ్వున అరుస్తున్నారు డి.శ్రీనివాస్
ప్రజలతో కాంగ్రెస్ ఆడుతున్న ఈ మ్యాచ్ కి మన నేతల కామెంట్రీ ఇది
ఏమైనా అక్టోబర్ వచ్చేసింది కాబట్టి ప్రజల టెన్షన్ కు ముగింపు వచ్చిందనుకోవచ్చు
Saturday, 28 September 2013
తల 'కట్టూ'
షారుఖ్ పిలకేసుకు కనిపిస్తే
సల్మాన్ మొదల్లైన వారందరూ పిలకలతో కనిపించారు చాలా రోజులు
ఎవరైనా ఒక కొత్త ట్రెండ్ మొదలు పెడితే
సినిమాలలో హీరోలే ఇలా అనుకరిస్తుంటే
ఇక రోడ్లలో యువత సంగతి చెప్పేదేముంది.
ఇప్పటికే పొడవైన వెంట్రుకలు అలవోకగా ఎగరేస్తూ
అబ్బాయిలు అమ్మాయిలని తలపిస్తున్నారు..
కుక్కలు తరమటం ఖాయం
కొత్తగా పెళ్ళిచేసుకున్నాడు
భార్యనిలా భయపెట్టడం ధోనీ మానుకోవాలి
లేకపోతే గృహ హింస కేసు భార్య పెట్టడం ఖాయం
Thursday, 26 September 2013
రాణీ మేడం
మీరు హీరో యిన్ గా చాలా త్వరగా పాపులారిటీ పొందారు కారణం ఏమిటంటారు రాణీ గారూ
నాకు మన యంటీర్ ఏ ఎన్ ఆర్ అంటే చాలా ఇష్టంచిన్నప్పటినుంచీ వారి పై ఆరాధన..
వణక్కం రాణీ మేడం
వణక్కం
తమిళ్ లో మీరు దా పాపులర్
మీకు ఎంద హీరో రొంబ పుడికుం మేడం..
ఎనకు MGR సార్ రొంబ పుడికుం గా..
చిన్నప్పటినుంచీ వారి సినిమాలే చూస్తూ పెరిగా..
అది ఎప్పడి..
ఎన్న అమ్మా తమిళ్ దా..
ఆమా .. అప్పడియా..
ఇంకెవరు మన రాజ్ కుమార్ సార్
మీరు తెలుగు కదా..
అయినా మా అమ్మ కన్నడ నేను చిన్నప్పటినుంచీ రాజ్ కుమార్ గారి సినిమా లు చూస్తూ పెరిగా..
నమస్తే జీ
ఆప్ హిందీ మే భీ సక్సెస్ ఫుల్ హోగయా..
హా జీ..
ఆప్ ఇతనా సక్సెస్ ఫుల్ బన్ నే కా సీక్రెట్ క్యా హై
వో యే హై కీ మేరా మమ్మీ రాజ్ కపూర్ సాబ్ కీ బహుత్ బడీ ఫాన్
ఉన్ కే సాథ్ బచ్ పన్ మే
ధరం జీ అమితాబ్ జీ
బహత్ ఫిలంస్ దేఖీ థీ మై
పెళ్ళాం చెబితే వినాలి
వ్యసనాలు రక రకాలు
వ్యసనమంటే అంటించుకున్న దాన్ని వదిలించుకోలేకపోవటమట.
అంటించుకుoది మంచిదైతే అలానే కంటిన్యూ చేయవచ్చునట..
వదిలించుకోవటమే పరీక్ష..
మన ఒబామా కుందో వ్యసనం
అది సిగరెట్టనే గొట్టం
వాళ్ళావిడ చెప్పిందీ
వెంటనే మానెయ్
పిల్లలు పెద్దాళ్ళవుతున్నారు
వాళ్ళముదు తాగటం బావుండదు..
అంతే
వెంటనే మానేశాడు ఒబామా
నేను నా భార్యకు భయపడి మానేశానని చెప్పుకున్నాడు కూడా
అలానే పెళ్ళాం చెబితే వినాలి అన్నది కూడా ఒక వ్యసనమే
అది మగవాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేదని
.ఒబామా ఎప్పుడు తెలుసు కుంటాడో పాపం..
అది మగవాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించేదని
.ఒబామా ఎప్పుడు తెలుసు కుంటాడో పాపం..
Tuesday, 24 September 2013
జగనన్న వచ్చేస్తున్నాడోచ్..
అన్నా
జగనన్నా
తొందరగా రా అన్నా
అక్కడ తెలగాణా లొల్లి
ఇక్కడ సమైక్యాంధ్ర లొల్లి
దిక్కు తోచక చస్తున్నాం
నీతోటైతే చిక్కులేదు
రాజశేఖరయ్య పోయిన శోకంలో ఉన్న జనాన్ని వెతికి వెతికిపట్టుకుని
మంచిగ ఇంటికొస్తవ్ వచ్చి వచ్చి
చెంపలు చెంపలతో జత చేసి నీవేడ్చ మేమేడ్చ..
ఒకటే దుఃఖం రాజశేఖరయ్య పోయిండు..
వా..
అంతో ఇంతో ముట్టజెపుతావ్ ఎల్లిపోతావ్.
తొందరగా రా అన్నా..
మేం రాజశేఖరయ్య పోయిన దుఃఖాన్ని భరించలేకుండా వున్నాం..
మమ్మల్నొచ్చి ఓదార్చూ..
Sunday, 22 September 2013
హైద్రాబాదును ఎక్కడన్నా దాచేస్తే..
వెధవ బొమ్మ తెచ్చారు
వీళ్ళిద్దరూ కొట్టుకు ఛస్తున్నారు
ఇంకోటి తేవల్సింది
నాకేం కోట్లు లేవు
రెండూ మూడూ తేవడానికి
రోజూ ఆ బొమ్మ కోసం రామ రావణ యుధ్ధం ఇద్దరూ వింటం లేదు
ఏం చేయమంటారు
తీసి దాచెయ్
అంతేనా..
ఆ..
విన్నారా..మీరిలా కొట్టుకుంటే బొమ్మ పక్కింటి బబ్లూ కిచ్చేస్తా..
వద్దమ్మా ఇయ్యవద్దు ఇకపై ఇద్దరూ కలిసి ఆడుకుంటాం
అస్సలు కొట్టుకోం
అలా రండి దారికి
***
ఈ తెలంగాణ గొడవతో తలనొప్పి వచ్చింది పిన్నిగారూ
ఇద్దరికీ బుధ్ధిలేదు..
అసలు ఈ గొడవకు అర్థం ఉంద..
విభజించాలని వాళ్ళూ
వద్దని వీళ్ళూ..హైద్రాబాద్ మాదే అని వాళ్ళు మాకే అని వీళ్ళు
ఈ వెధవ గొడవతో పిల్లల చదువు పాడవుతోంది
స్కూల్ అస్సలు జరగటం లేదు..
అమ్మా..
అమ్మా..
వుండరా..
కాఫీ పెడతాను పిన్నిగారూ..
వద్దమ్మా..
మీరలాగే అంటారు ఎంత నిమిషం పట్టదు వుండండి..
అమ్మా..
అమ్మా..
ఏంట్ర..
అమ్మా నీవు ఆ బొమ్మని దాచేసినట్లు ఆ సోనియా హైద్రాబాదును ఎక్కడన్నా దాచేస్తే..
అప్పుడు వీళ్ళూ దెబ్బలాడుకోకుండా నోర్మూసుకుని వుంటారు..
కదరా తమ్ముడూ..
వద్దురా..అన్నయ్యా..
అప్పుడు మనకు స్కూల్ రోజూ వుంటుంది అప్పుడు ఆటలూలేవు.. సెలవులూ లేవు..
వీళ్ళిద్దరూ కొట్టుకు ఛస్తున్నారు
ఇంకోటి తేవల్సింది
నాకేం కోట్లు లేవు
రెండూ మూడూ తేవడానికి
రోజూ ఆ బొమ్మ కోసం రామ రావణ యుధ్ధం ఇద్దరూ వింటం లేదు
ఏం చేయమంటారు
తీసి దాచెయ్
అంతేనా..
ఆ..
విన్నారా..మీరిలా కొట్టుకుంటే బొమ్మ పక్కింటి బబ్లూ కిచ్చేస్తా..
వద్దమ్మా ఇయ్యవద్దు ఇకపై ఇద్దరూ కలిసి ఆడుకుంటాం
అస్సలు కొట్టుకోం
అలా రండి దారికి
***
ఈ తెలంగాణ గొడవతో తలనొప్పి వచ్చింది పిన్నిగారూ
ఇద్దరికీ బుధ్ధిలేదు..
అసలు ఈ గొడవకు అర్థం ఉంద..
విభజించాలని వాళ్ళూ
వద్దని వీళ్ళూ..హైద్రాబాద్ మాదే అని వాళ్ళు మాకే అని వీళ్ళు
ఈ వెధవ గొడవతో పిల్లల చదువు పాడవుతోంది
స్కూల్ అస్సలు జరగటం లేదు..
అమ్మా..
అమ్మా..
వుండరా..
కాఫీ పెడతాను పిన్నిగారూ..
వద్దమ్మా..
మీరలాగే అంటారు ఎంత నిమిషం పట్టదు వుండండి..
అమ్మా..
అమ్మా..
ఏంట్ర..
అమ్మా నీవు ఆ బొమ్మని దాచేసినట్లు ఆ సోనియా హైద్రాబాదును ఎక్కడన్నా దాచేస్తే..
అప్పుడు వీళ్ళూ దెబ్బలాడుకోకుండా నోర్మూసుకుని వుంటారు..
కదరా తమ్ముడూ..
వద్దురా..అన్నయ్యా..
అప్పుడు మనకు స్కూల్ రోజూ వుంటుంది అప్పుడు ఆటలూలేవు.. సెలవులూ లేవు..
Sunday, 15 September 2013
సరిజోడు
నీలవేణికి పెళ్ళి చూపులు
ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు
లక్షల్లో జీతం
మంచి కుటుంబం
అబ్బాయి బుధ్ధిమంతుదు
ఇంట్లోఅందరూ ఒకటికి పది సార్లు ఇప్పటికి
ఈ విషయాలు ముచ్చటించుకుని మురిసిపోయారు
కానీ నీలవేణి మనసు మండిపోతూంది
ఎట్లా ఈ కార్యక్రమాన్ని అట్టర్ ఫ్లాప్ చెయ్యాలా
అని తెగ ఆలోచిస్తూంది
స్నేహితులతో మంత్రాంగం చేసింది
తలా ఒక సలహా చెప్పారు
మంగ అతగాణ్ణి పక్కకు తీసుకెళ్ళి
నాకీ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయమంది
సరిత ఆకాశరామన్న ఉత్తరం ఒకటి
మంచి మసాలా అపధ్ధాలను కల్పించి రాసి
వాళ్ళ మనసు విరిచేయొచ్చని ఐడియా ఇచ్చింది
ఇదేదో తేడాగుంది నేను జంపు
అని జ్యోతి అడ్రసు లేకుండాపోయింది
అతగాణి అఫీసుకు వెళ్ళి
అక్కడి అబ్బాయిలతో అతను చూసేలాగ
చనువుగా తిరిగి
తను చాలా బ్యాడ్ కారెక్టర్ అని అతను అనుకొనేలాగ చేయమని
పేద్ద అయిడియా ఇచ్చింది సురేఖ..
కానీ పెళ్ళి చూపులవరకూ కథ రానేవచ్చింది
ఛ..
పదకొండో సారి అనుకుంది నీలవేణి
బుట్టెడు పూలు నెత్తి మీద పెట్టారు
తనకు పూలంటే చచ్చే అలర్జీ..
మెడనిండా నగలు దిగేసారు
అమ్మవి బామ్మవి అత్తయ్యవి పిన్నివీ ఇంకా ఊరందరివీ..
ఒకరివి కాదంటే కోపం
వేసుకోనంటే నిష్టూరం
తనేమైనా బొమ్మా
తనకంటూ ఇష్టాఇష్టాలు లేవా..
ఈ పెద్దవాళ్ళున్నారే..
పెదవి కొరుక్కుంది..
తనసలే అందంగా ఉంటుంది
ఆ అబ్బాయికి కొంపదీసి నచ్చితే..
గుండె దడ దడ కొట్టుకుంది
నచ్చకపోవటమేమిటి నచ్చి తీరుతుంది
ఎలా..
అందరూ హాల్లో హాస్యాలాడుకుంటున్నారు
తను ఒక్కతీ రూములో
తను చిర చిర లాడుతుంటే
అందరూ తనను అలంకరించి
హాలులో చేరారు
పెరట్లోంచీ పారిపోతే..
ఎక్కడికి పారిపోతుంది
ఛ..
ఒక్కణ్ణీ సరిగ్గ ప్రేమించలేదు
ఎంతమంది వెంటపడ్డారు
ఒక్కడికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
ఎవరిని చూసినా వీడు నాకు తగడు అనిపించేది..
సుధాకర్ ప్రాణం తీసుకుంటానన్నాడు
రాంచరణ్ వీధి మొదట్లో
నాలుగు సంవత్సరలు పడిగాపులు పడ్డాడు
కృష్ణ సత్య విక్కీ చక్రీ
హయ్యో
ప్రేమించి పెళ్ళి చేసుకోకుంటే మజా ఏముంది
హారి దేవుడా నాకు ఎన్ని కష్టాలు
ఇంతలో బిల బిల మంటు రోసీ లీల లావణ్య వాణి వచ్చేసారు
హాయ్..
ఎలాఉన్నావ్ అంటూ
వారిని చూసి నీలవేణి అమ్మానాన్న కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు
వచ్చారా
మీ స్నేహితురాలిని ఇంకా యేమైనా అలంకరించండి
తను కూడా మీరు లేరని దిగాలుగా వుంది
ఎంతైనా స్నేహితులు కదా
అలాగే ఆంటీ..
హాయ్ నీలూ
ఎలా ఉన్నావ్
అంటూ వయ్యారాలు పోతూ
నీలవేణి స్నేహితులు రూములోకి వెళ్ళారు
వారు మాట్లాడుతుంటే
తెలుగును చక్కెరలో ముంచి తీసి మాట్లాడుతున్నట్లుంది..
వారిని చూడగానే నీలవేణి ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగింది
ఏంటే నీవేనా గుడిలో అమ్మవారేమో అనుకున్నా
రోసీ అంది
మా అక్క పెళ్ళి చూపులకి
ఒక సన్న చైన్ వేలికి ఒక ఉంగరం అంతే..
ఆ తల్లో ఒక గులాబీ..
ఏంచేయనే..
అంది నీలవేణి కంపరంగా
పైనేమో పూల షాపు
కిందంతా నగలషాపు
నీముందు నీ కివ్వబోయే కరెన్సీ పెడతారేమో..
అదో రిజర్వ్ బాంక్
పక పకా నవ్వింది
చాల్లెండే ఏదైనా ఉపాయం చెప్పకుండా ఆటపట్టిస్తున్నారు..
గునిసింది నీలవేణి
మరో ఇద్దరు అటొకరు ఇటొకరూ చెవిలో నీలవేణికిఏదో ఉపదేశం చేసారు
వెంటనే నీలవేణి ముఖం విప్పారింది
అమ్మయ్య మీరొచ్చారు
ఎంత ధైర్యం వచ్చిందో
అబ్బాయ్ తరఫు వాళ్ళూ వచ్చారు
అందరూ బిల బిలమంటూ బయటకు వెళ్ళి వారిని లోపలికి తీసుకొచ్చారు
మర్యాదలు చేసారు
అబ్బాయ్ డీసెంట్ గా వున్నాడు
అందంగా వున్నాడు
పిల్లని తీసుకురండి అన్నారు
ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి చెప్పేసరికి
నలుగురు స్నేహితులూ నీలవేణిని తీసుకొస్తున్నారు
వస్తున్న నీలవేణిని చూసారు బంధువులు
మళ్ళీ అందరి చూపులూ మగపెళ్ళి వారివేపు మళ్ళాయి
వెంటనే ప్లాన్ నెంబర్ వన్ అప్లయ్ చేసింది నీలవేణి
కుంటుతూ నడవడం మొదలు పెట్టింది
ఇది చూసిన మగపెళ్ళి తరఫు వారు కంగారు పడ్డారు
ఏంటి అమ్మాయి కుంటుతుంది..
ఎలా వాళ్ళని అడగడం..
ఇది చూసిన నీలవేణి స్నేహితులు నవ్వును బిగపట్టుకున్నారు..
కూర్చోమ్మా..
వెంటనే నీలవేణి చంకలోంచీ కర్రలను తీసి కూచుంది
కుర్చీలో.వెంటనే నీలవేణి స్నేహితులు ఆ కర్రలను ఒకరినుంచీ ఒకరు అందుకుని గోడపక్క దాచేసారు
అవి నీలవేణి బాబాయ్ వాళ్ళ కొడుకువి..
వీళ్ళిలా ఉపయోగించుకున్నారు..
మగపెళ్ళి వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి
స్నేహితులు నలుగురూ "య్యస్ "అనుకున్నారు చూపులతో
ఇంతలో నీలవేణి బాబాయ్
అమ్మా నీలూ అంత సిగ్గయితే ఎలా
కాస్త అబ్బాయిని చూడు..
ఆనక నేను చూడలేదు మళ్ళీ చూడలంటె కుదర్దు..
దగ్గరికొచ్చి నెత్తిపై చిన్న దెబ్బవేసి అన్నాడు
సరేనంటూ తలౌఉపింది నీలూ
బాబాయ్ అటు తిరగ్గానే
మెల్లకన్ను పెట్టి తలెత్తుతూ తననే చూస్తున్న్ నెమ్మదిగామగపెళ్ళి వారివంక చూసింది..
దెబ్బకు దిమ్మ తిరిగి పోయింది వాళ్ళకి
ఈసారి మరింత ఆందోళన ఎక్కువైంది..
రోసీ లావణ్య మూతి బిగించి నవ్వసాగారు
నీలవేణికీ ఇదేదో తమాషాగానే ఉంది..
కానీ
పెళ్ళికొడుకు ఇదంతా కనిపెట్టాడు
అతనికి వీళ్ళ తంతు అర్థమైంది..
అమ్మాయికి నడవడానికేమైనా ఇబ్బందా అన్నయ్యగారూ అంది
పిల్లాడి తల్లి
అబ్బే అలాంటిదేం లేదమ్మా
నీలూ కాలేమైనా నొప్పిచేసిందా అన్నాడు నాన్న..
చక్కటి కళ్ళు కానీ కాస్త .. మెల్ల లా వుంది.
ఈసారి కాస్త కోపం వచ్చింది నీలూ నాన్నకి
ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు
మా పిల్లకి మెల్లా..
అన్నాడు కరుగ్గా..
నీలూ ఒకసారి తలెత్తూ..
నీలవేణికి తలెత్తక తప్పలేదు
మెల్ల మంత్రం ఫలించలేదు..
చక్కగా చూసింది..
అబ్బాయ్ అమ్మాయిని చూసి నవ్వాడు కొంటెగా..
లేదన్నయ్య గారూ అమ్మాయ్ లక్ష్మిలా వుంది..
నీలవేణి స్నేహితులు ఆ అబ్బాయిని చూసి అయిసయిపోయారు..
అందరి గుండెల్లోనూ సన్నని గిలిగింత
పిల్లని లోపలికి తీసుకెళ్ళండమ్మా అన్నాడు మధ్యవర్తి..
పెళ్ళి చూపుల తతంగం ముగిసింది
ఇచ్చి పుచ్చుకోవడాలు మాట్లాడుకుంటున్నారు
రెండోసారి కాఫీలు వెళ్ళాయి..
నీలవేణి స్నేహితులు రూములో చేరారు..
అబ్బాయ్ బావున్నాడే..
చేసేసుకో అంది లావణ్య..
అవునే ఆ అబ్బాయికేం తక్కువ..
అంది
అంది
కానీ జీవితంలో ఒకే ఒక్కసారి పెళ్ళి చేసుకుంటామే
కాస్త ప్రేమించి
అభిరుచులూ అభిప్రాయాలూ కలిసాకా చేసుకుంటే ఎంత బావుంటుంది చెప్పు..
దీనంగా అంది నీలవేణి..
అవునే.. పాపం..నీలవేణి
అందుకే ఎవరో ఒకరిని ప్రేమించవే ప్రేమించవే అని
చిలక్కు చెప్పినట్లు చెప్పానే..
అంది లావణ్య
సరేలే నీవు ప్రేమించు అనగానే ప్రేమ పుడుతుందా..
గుండెల్లో ఒక ఫీలింగ్ కలగొద్దూ
నాకు శశాంక్ ని చూడగానే అలాగే కలిగింది..
అందుకే ప్రేమించా
మరి వాడు చదువు రాని మొద్దు కదే..
చదువుదేం వుందే..
జీవితం మళ్ళీ రమ్మటే వస్తుందా..
లవ్ అనేది ఒక వరం అది అందరికీ దొరకదు..
అంది లావణ్య అరమోడ్పు కళ్ళతో
ఆరాధనగా చూసింది నీలవేణి
ఇలా వాళ్ళ సంభాషణ సాగి సాగి
ఇక మేం వెళ్తామే అని ఒకరికొకరు బై చెప్పుకొని వెళ్ళే పోయారు
అక్కడ పెళ్ళివాళ్ళూ వెళ్ళిపోయారు
రాత్రి నీలవేణీ జరిగిందంతా ఆలోచిస్తూ గడిపింది
నిద్రలో తను పెళ్ళయి ఆ అబ్బాయితో ఏడుస్తూ వెళ్ళిపోతున్నట్టు పీడకలలు..
మరుసటిరోజు తన జీవితంలో మరపురాని రోజు కాబోతూందని
నీలవేణికి తెలియదు
ఎప్పట్లానే తెల్లారింది
కాఫీలయ్యాక
అందరూ ఒకసారి క్రితం రోజు సంగతులు ముచ్చటించుకున్నారు
తరువాత తలోదారీ ఆఫీసులకు వెళ్ళిపోయారు
నీలవేణి కాలేజ్ కి వెళ్తూంది
దారిలో బస్సు చెడిపోయింది
ఆటోలు దొరకలేదు
కాలేజ్ టైమైపోయింది..
కాలేజ్ కెళ్ళాలా లేక ఇంటికా అన్న డైలమాలో
మెల్లిగా నడుస్తూంది నీలూ
ఇంతలో తనపక్కనే ఒక లావుటబ్బాయి నడచి వెళ్ళాడు
అతన్ని ఆసక్తిగా చూసింది
అతను పొడవాటి గుడ్డసంచీ వేసుకున్నాడు
కంటికి అద్దాలు ఉన్నాయి
అతను ఆరాం గా అటూ ఇటూ చూస్తూ
తొలిసారి హైదరాబాద్ వచ్చినట్లు
ఒక్కో భవనాన్నీ పైనుంచీ కిందిదాకా చూస్తూ నడుస్తున్నాడు..
అతని పక్క నడుస్తున్న చిన్నపాపని
హాయ్ బుజ్జీ అని బుగ్గపై ఒక చిటికె వేసాడు..
ఆ పాప ఇతన్ని చూసి నవ్వింది
దట్స్ గుడ్ అంటూ
వెనక్కి తిరిగి నడుస్తూ తల ఒక పక్కగా వంచి రాజేష్
ఖన్నాలా నవ్వాడు
దారిన పోతున్న ఒక బిచ్చగాడి భుజం చుట్టూ చేయివేసి రోడ్డు దాటించాడు..
ఈసారి ఈలవేస్తూ చెంగు చెంగున గెంతుతున్నాడు
అడ్డువచ్చిన ఒక చెట్టు చుట్టూ స్టయిల్ గా తిరిగాడు గిర్రున
ఇదంతా విచిత్రంగా వుంది నీలవేణికి
ఎవరబ్బా ఇతను
ఏంటిలా బిహేవ్ చేస్తున్నాడు..
వేరుశనక్కాయలు కొనుక్కొని
వంద ఇచ్చి చిల్లర అతను ఇవ్వబోతే
వద్దులే నీవే వుంచుకో అన్నాడు ఉదారంగా..
అక్కడి అబ్బాయిలతో అతను చూసేలాగ
చనువుగా తిరిగి
తను చాలా బ్యాడ్ కారెక్టర్ అని అతను అనుకొనేలాగ చేయమని
పేద్ద అయిడియా ఇచ్చింది సురేఖ..
కానీ పెళ్ళి చూపులవరకూ కథ రానేవచ్చింది
ఛ..
పదకొండో సారి అనుకుంది నీలవేణి
బుట్టెడు పూలు నెత్తి మీద పెట్టారు
తనకు పూలంటే చచ్చే అలర్జీ..
మెడనిండా నగలు దిగేసారు
అమ్మవి బామ్మవి అత్తయ్యవి పిన్నివీ ఇంకా ఊరందరివీ..
ఒకరివి కాదంటే కోపం
వేసుకోనంటే నిష్టూరం
తనేమైనా బొమ్మా
తనకంటూ ఇష్టాఇష్టాలు లేవా..
ఈ పెద్దవాళ్ళున్నారే..
పెదవి కొరుక్కుంది..
తనసలే అందంగా ఉంటుంది
ఆ అబ్బాయికి కొంపదీసి నచ్చితే..
గుండె దడ దడ కొట్టుకుంది
నచ్చకపోవటమేమిటి నచ్చి తీరుతుంది
ఎలా..
అందరూ హాల్లో హాస్యాలాడుకుంటున్నారు
తను ఒక్కతీ రూములో
తను చిర చిర లాడుతుంటే
అందరూ తనను అలంకరించి
హాలులో చేరారు
పెరట్లోంచీ పారిపోతే..
ఎక్కడికి పారిపోతుంది
ఛ..
ఒక్కణ్ణీ సరిగ్గ ప్రేమించలేదు
ఎంతమంది వెంటపడ్డారు
ఒక్కడికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
ఎవరిని చూసినా వీడు నాకు తగడు అనిపించేది..
సుధాకర్ ప్రాణం తీసుకుంటానన్నాడు
రాంచరణ్ వీధి మొదట్లో
నాలుగు సంవత్సరలు పడిగాపులు పడ్డాడు
కృష్ణ సత్య విక్కీ చక్రీ
హయ్యో
ప్రేమించి పెళ్ళి చేసుకోకుంటే మజా ఏముంది
హారి దేవుడా నాకు ఎన్ని కష్టాలు
ఇంతలో బిల బిల మంటు రోసీ లీల లావణ్య వాణి వచ్చేసారు
హాయ్..
ఎలాఉన్నావ్ అంటూ
వారిని చూసి నీలవేణి అమ్మానాన్న కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు
వచ్చారా
మీ స్నేహితురాలిని ఇంకా యేమైనా అలంకరించండి
తను కూడా మీరు లేరని దిగాలుగా వుంది
ఎంతైనా స్నేహితులు కదా
అలాగే ఆంటీ..
హాయ్ నీలూ
ఎలా ఉన్నావ్
అంటూ వయ్యారాలు పోతూ
నీలవేణి స్నేహితులు రూములోకి వెళ్ళారు
వారు మాట్లాడుతుంటే
తెలుగును చక్కెరలో ముంచి తీసి మాట్లాడుతున్నట్లుంది..
వారిని చూడగానే నీలవేణి ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగింది
ఏంటే నీవేనా గుడిలో అమ్మవారేమో అనుకున్నా
రోసీ అంది
మా అక్క పెళ్ళి చూపులకి
ఒక సన్న చైన్ వేలికి ఒక ఉంగరం అంతే..
ఆ తల్లో ఒక గులాబీ..
ఏంచేయనే..
అంది నీలవేణి కంపరంగా
పైనేమో పూల షాపు
కిందంతా నగలషాపు
నీముందు నీ కివ్వబోయే కరెన్సీ పెడతారేమో..
అదో రిజర్వ్ బాంక్
పక పకా నవ్వింది
చాల్లెండే ఏదైనా ఉపాయం చెప్పకుండా ఆటపట్టిస్తున్నారు..
గునిసింది నీలవేణి
మరో ఇద్దరు అటొకరు ఇటొకరూ చెవిలో నీలవేణికిఏదో ఉపదేశం చేసారు
వెంటనే నీలవేణి ముఖం విప్పారింది
అమ్మయ్య మీరొచ్చారు
ఎంత ధైర్యం వచ్చిందో
అబ్బాయ్ తరఫు వాళ్ళూ వచ్చారు
అందరూ బిల బిలమంటూ బయటకు వెళ్ళి వారిని లోపలికి తీసుకొచ్చారు
మర్యాదలు చేసారు
అబ్బాయ్ డీసెంట్ గా వున్నాడు
అందంగా వున్నాడు
పిల్లని తీసుకురండి అన్నారు
ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి చెప్పేసరికి
నలుగురు స్నేహితులూ నీలవేణిని తీసుకొస్తున్నారు
వస్తున్న నీలవేణిని చూసారు బంధువులు
మళ్ళీ అందరి చూపులూ మగపెళ్ళి వారివేపు మళ్ళాయి
వెంటనే ప్లాన్ నెంబర్ వన్ అప్లయ్ చేసింది నీలవేణి
కుంటుతూ నడవడం మొదలు పెట్టింది
ఇది చూసిన మగపెళ్ళి తరఫు వారు కంగారు పడ్డారు
ఏంటి అమ్మాయి కుంటుతుంది..
ఎలా వాళ్ళని అడగడం..
ఇది చూసిన నీలవేణి స్నేహితులు నవ్వును బిగపట్టుకున్నారు..
కూర్చోమ్మా..
వెంటనే నీలవేణి చంకలోంచీ కర్రలను తీసి కూచుంది
కుర్చీలో.వెంటనే నీలవేణి స్నేహితులు ఆ కర్రలను ఒకరినుంచీ ఒకరు అందుకుని గోడపక్క దాచేసారు
అవి నీలవేణి బాబాయ్ వాళ్ళ కొడుకువి..
వీళ్ళిలా ఉపయోగించుకున్నారు..
మగపెళ్ళి వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి
స్నేహితులు నలుగురూ "య్యస్ "అనుకున్నారు చూపులతో
ఇంతలో నీలవేణి బాబాయ్
అమ్మా నీలూ అంత సిగ్గయితే ఎలా
కాస్త అబ్బాయిని చూడు..
ఆనక నేను చూడలేదు మళ్ళీ చూడలంటె కుదర్దు..
దగ్గరికొచ్చి నెత్తిపై చిన్న దెబ్బవేసి అన్నాడు
సరేనంటూ తలౌఉపింది నీలూ
బాబాయ్ అటు తిరగ్గానే
మెల్లకన్ను పెట్టి తలెత్తుతూ తననే చూస్తున్న్ నెమ్మదిగామగపెళ్ళి వారివంక చూసింది..
దెబ్బకు దిమ్మ తిరిగి పోయింది వాళ్ళకి
ఈసారి మరింత ఆందోళన ఎక్కువైంది..
రోసీ లావణ్య మూతి బిగించి నవ్వసాగారు
నీలవేణికీ ఇదేదో తమాషాగానే ఉంది..
కానీ
పెళ్ళికొడుకు ఇదంతా కనిపెట్టాడు
అతనికి వీళ్ళ తంతు అర్థమైంది..
అమ్మాయికి నడవడానికేమైనా ఇబ్బందా అన్నయ్యగారూ అంది
పిల్లాడి తల్లి
అబ్బే అలాంటిదేం లేదమ్మా
నీలూ కాలేమైనా నొప్పిచేసిందా అన్నాడు నాన్న..
చక్కటి కళ్ళు కానీ కాస్త .. మెల్ల లా వుంది.
ఈసారి కాస్త కోపం వచ్చింది నీలూ నాన్నకి
ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు
మా పిల్లకి మెల్లా..
అన్నాడు కరుగ్గా..
నీలూ ఒకసారి తలెత్తూ..
నీలవేణికి తలెత్తక తప్పలేదు
మెల్ల మంత్రం ఫలించలేదు..
చక్కగా చూసింది..
అబ్బాయ్ అమ్మాయిని చూసి నవ్వాడు కొంటెగా..
లేదన్నయ్య గారూ అమ్మాయ్ లక్ష్మిలా వుంది..
నీలవేణి స్నేహితులు ఆ అబ్బాయిని చూసి అయిసయిపోయారు..
అందరి గుండెల్లోనూ సన్నని గిలిగింత
పిల్లని లోపలికి తీసుకెళ్ళండమ్మా అన్నాడు మధ్యవర్తి..
పెళ్ళి చూపుల తతంగం ముగిసింది
ఇచ్చి పుచ్చుకోవడాలు మాట్లాడుకుంటున్నారు
రెండోసారి కాఫీలు వెళ్ళాయి..
నీలవేణి స్నేహితులు రూములో చేరారు..
అబ్బాయ్ బావున్నాడే..
చేసేసుకో అంది లావణ్య..
అవునే ఆ అబ్బాయికేం తక్కువ..
అంది
అంది
కానీ జీవితంలో ఒకే ఒక్కసారి పెళ్ళి చేసుకుంటామే
కాస్త ప్రేమించి
అభిరుచులూ అభిప్రాయాలూ కలిసాకా చేసుకుంటే ఎంత బావుంటుంది చెప్పు..
దీనంగా అంది నీలవేణి..
అవునే.. పాపం..నీలవేణి
అందుకే ఎవరో ఒకరిని ప్రేమించవే ప్రేమించవే అని
చిలక్కు చెప్పినట్లు చెప్పానే..
అంది లావణ్య
సరేలే నీవు ప్రేమించు అనగానే ప్రేమ పుడుతుందా..
గుండెల్లో ఒక ఫీలింగ్ కలగొద్దూ
నాకు శశాంక్ ని చూడగానే అలాగే కలిగింది..
అందుకే ప్రేమించా
మరి వాడు చదువు రాని మొద్దు కదే..
చదువుదేం వుందే..
జీవితం మళ్ళీ రమ్మటే వస్తుందా..
లవ్ అనేది ఒక వరం అది అందరికీ దొరకదు..
అంది లావణ్య అరమోడ్పు కళ్ళతో
ఆరాధనగా చూసింది నీలవేణి
ఇలా వాళ్ళ సంభాషణ సాగి సాగి
ఇక మేం వెళ్తామే అని ఒకరికొకరు బై చెప్పుకొని వెళ్ళే పోయారు
అక్కడ పెళ్ళివాళ్ళూ వెళ్ళిపోయారు
రాత్రి నీలవేణీ జరిగిందంతా ఆలోచిస్తూ గడిపింది
నిద్రలో తను పెళ్ళయి ఆ అబ్బాయితో ఏడుస్తూ వెళ్ళిపోతున్నట్టు పీడకలలు..
మరుసటిరోజు తన జీవితంలో మరపురాని రోజు కాబోతూందని
నీలవేణికి తెలియదు
ఎప్పట్లానే తెల్లారింది
కాఫీలయ్యాక
అందరూ ఒకసారి క్రితం రోజు సంగతులు ముచ్చటించుకున్నారు
తరువాత తలోదారీ ఆఫీసులకు వెళ్ళిపోయారు
నీలవేణి కాలేజ్ కి వెళ్తూంది
దారిలో బస్సు చెడిపోయింది
ఆటోలు దొరకలేదు
కాలేజ్ టైమైపోయింది..
కాలేజ్ కెళ్ళాలా లేక ఇంటికా అన్న డైలమాలో
మెల్లిగా నడుస్తూంది నీలూ
ఇంతలో తనపక్కనే ఒక లావుటబ్బాయి నడచి వెళ్ళాడు
అతన్ని ఆసక్తిగా చూసింది
అతను పొడవాటి గుడ్డసంచీ వేసుకున్నాడు
కంటికి అద్దాలు ఉన్నాయి
అతను ఆరాం గా అటూ ఇటూ చూస్తూ
తొలిసారి హైదరాబాద్ వచ్చినట్లు
ఒక్కో భవనాన్నీ పైనుంచీ కిందిదాకా చూస్తూ నడుస్తున్నాడు..
అతని పక్క నడుస్తున్న చిన్నపాపని
హాయ్ బుజ్జీ అని బుగ్గపై ఒక చిటికె వేసాడు..
ఆ పాప ఇతన్ని చూసి నవ్వింది
దట్స్ గుడ్ అంటూ
వెనక్కి తిరిగి నడుస్తూ తల ఒక పక్కగా వంచి రాజేష్
ఖన్నాలా నవ్వాడు
దారిన పోతున్న ఒక బిచ్చగాడి భుజం చుట్టూ చేయివేసి రోడ్డు దాటించాడు..
ఈసారి ఈలవేస్తూ చెంగు చెంగున గెంతుతున్నాడు
అడ్డువచ్చిన ఒక చెట్టు చుట్టూ స్టయిల్ గా తిరిగాడు గిర్రున
ఇదంతా విచిత్రంగా వుంది నీలవేణికి
ఎవరబ్బా ఇతను
ఏంటిలా బిహేవ్ చేస్తున్నాడు..
వేరుశనక్కాయలు కొనుక్కొని
వంద ఇచ్చి చిల్లర అతను ఇవ్వబోతే
వద్దులే నీవే వుంచుకో అన్నాడు ఉదారంగా..
పరాకుగా నడుస్తున్న నీలవేణిని ఒకస్కూటర్ గుద్దేయబోయింది..
ఏంటమ్మా చూసి నడవ్వా ..
హయ్యో అంటూ తలకొట్టుకుని వెళ్ళి పోయాడు అతను
ఎక్కడినుంచీ వచ్చాడో కిందకు పడబోయిన నీలవేణి భుజాలు గిరుక్కున పట్టుకునాపాడు లావుటబ్బాయ్..
నీలవేణి సినిమాలోలా అతనిచేతుల్లో వాలిపోయింది..
అతను నీలవేణి కళ్ళల్లో కళ్ళుపెట్టిచూసి
ఆర్యూ ఓ కే..
అన్నాడు
హా.. హా..
అంది నీలూ
ఇద్దరూ కలిసి నడవసాగారు..
థాంక్స్ అంది నీలవేణి..
ఇట్స్ ఓ కే..
మీరు హైడ్రాబాడ్ కి కొత్తా అంది
నో .. అయాం బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ యూ నో..
మీరు ఎవరినైనా ప్రేమించారా..
అన్నాడు..
లే.. లేదు..
అంది..ముఖం ఎర్రబడింది..
ఏం లేదు అలా కలలు కంటూ నడుస్తుంటే
ఆక్సిడెంటయ్యే వాళ్ళంతా ప్రేమించాలని రూలుందా..
ఏం అనుకోకండి నేనిక్కడ ఏం అనిపిస్తే అది మాట్లాడతాను
ఇక్కడ యేం చెయ్యాలనిపిస్తే అది చేస్తాను..
గుండెలు కొట్టుకుంటూ అన్నాడు
అలాగా.. అన్నట్లు చూసింది
అయిస్ క్రీం బండి వచ్చింది..
కావాలా అని అడిగాడు..
వద్దు.. అంది మొహమాటంగా..
అతను వెళ్ళి నాలుగు అయిస్ క్రీం లు తెచ్చుకున్నాడు..
నాలుగెవరికీ..
నాకే..
నాలుగూ ఒకేసారి తింటున్నాడు
చిన్నపిల్లాడు తింటున్నట్టుంది..
నీల వేణి మదిలో యేవో ద్వారాలు తెరుచుకున్నాయ్
ఆమె అలా చూస్తుండగానే నాలుగూ నాకి నాకి తిన్నాడు
మీరు..
కాలేజ్ కి వెళ్ళాలి బస్ చెడిపోయింది..
ఎలాగూ వెళ్ళాలని లేదు..
అందుకే ఇలా రిలాక్స్డ్ గా నడుస్తున్నా..
నేనూ అంతే..
మొదట స్టడీస్ కి అమెరికాకెళ్ళా
మధ్యలో చెయ్యాలనిపించలే..
సడన్ గా కాలేజ్ మానేసి ఇండియా వచ్చా..
అవునా ఆశ్చర్యంగా చూసింది..
అవునండీ
నేనంతే
ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతా..
ఇక్కడ యేమనిపిస్తే అది చేస్తా..
అంటూ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి..
నీలవేణి గుండెల్లో గంటలు మోగాయ్..
మా మావయ్య ఉద్యోగమిప్పించాడు..
ఆస్రేలియాతో డీల్ అక్కడ నేనుండి సెటిల్ చేయాలి
సడన్ గా ఉద్యోగం మానేసా..
అవునండీ నేనంతే
ఇక్కడ యేమనిపిస్తే అది మాట్లాడతా
ఇక్కడ యేమనిపిస్తే అది చేతా..
మళ్ళీ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి
దారిపక్కన మురికి నీరు నిలిచివుంది
అందరూ దాన్ని దాటుకుంటూజాగ్రత్తగా వెళ్తున్నారు..
ఆ అబ్బాయ్ గబ గబా పరుగెత్తుకెళ్ళి ధబ్బున ఆ నీళ్ళల్లో జంప్ చేసాడు..
ఆ మురికి నీరు దారిన పోతున్న అందరిమీదా చిమ్మి వారి బట్టలు ఖరాబయ్యాయ్
ఏ.. పాగల్ హైక్యా..
కైసాకూద్ రా యే..
హఠ్..
చీదరించుకున్నారు అందరూ..
ఆ అబ్బాయి మాత్రం వీరి మాటలు లెక్క చెయ్యకుండ
చప్పట్లు కొడ్తూ నవ్వాడు..
చప్పట్లు కొడ్తూ నవ్వాడు..
మళ్ళీ జంప్ చేసాడు.
మళ్ళీ జంప్
అతని బట్టలూ ముఖం మురికి మురికి
కానీ అతను భలే ఎంజాయ్ చేస్తున్నాడు
నీలవేణి గుండెల్లో సితార్లు సందడి చేసాయి
ఆరాధనగా చూసింది
యు ఆల్సో వాంట్ టు డూ డూ లైక్ మీ కం కం అంటున్నాడు
నేఅలవేణీ నీళ్ళల్లో ఒక్క గెంతు గెంతింది..
భలే వుంది..
ఇద్దరూ అలా కొన్ని సార్లు గెంతి
బయటికొచ్చారు..
మై హార్టీస్ బీటింగ్ అని పాడుతున్నాడు ఆ అబ్బాయ్..
నీలవేణీ హం చేసింది..
ఇద్దరూ మళ్ళీ ఎనిమిది అయిస్ క్రీం లు కొనుక్కుని
నాకి నాకి తిన్నారు..
ఎన్నో మాట్లాదుకున్నారు..
టీ బంకుల్లో చాయ్ తాగుతూ
ఇద్దరి అభిప్రాయాలూ అభిరుచులూ కలిసాయ్
అనిపించింది నీలవేణీకి
ఇతనే ఇతనే నా సరిజోడు అంది ఆమె మనసు
చివరగా ఇద్దరూ అయ్ లవ్యూ అని చెప్పుకున్నారు..
Saturday, 14 September 2013
చంద్రముఖి
అవి చంద్రముఖి విడుదలైన రోజులు
అందరూ సినిమా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నరోజులు
చూసొచ్చిన వాళ్ళు చూడని వారిని చూసేదాకా ఊరించి ఊరించి చంపేవారు..
ఎవ్వరి నోట్లో నూ లక లక లక శబ్దం అప్రయత్నంగా వచ్చేది
జ్యోతిక కళ్ళు తోం తోం తోం అంటూ తిప్పితే
ఎందరో గుండె పట్టుకుని హాలులోనే పడిపోయారు.. ట...
ఒకరోజు రైతు బజారుకు రాత్రి తొమ్మిదిన్నరకు బయలు దేరింది
కూరలకు సావిత్రి
కూరగాయలవాళ్ళు అందరు వాళ్ళ సామాను సర్దుకుని ఆటోలకు ఎక్కిస్తున్నారు
హయ్యో కూరలు లేవే..
రేపేమి వండేది
మాయదారి సినిమా చూస్తూ ఎంతపనిచేసాను
ఒక్క కూరలవాడైనా ఉండకపోడా
అనుకుంటూ నడుస్తూంది..
ఒకచోట వీధి లైటు విశ్రాంతి తీసుకుంది
చీకటిలోనే నడుస్తూంది కూరగాయలపై ఆందోళనతో సావిత్రి
దూరాన ఒక బండి
వాడూ వెళ్ళే ప్రయత్నం లో ఉన్నట్టుంది
వాడి దగ్గర అంత్యదశలో ఉన్న పెట్రొమాక్సు లైటు
బాబూ..
బాబూ..
ఆగు
అప్పుడే సర్దేయకు
నేను కొనడానికి వస్తున్నా..
వ్యాపారం చేసే వాణికి వినియోగదారుడే కదా రాజు..ఛ.. రాణి
అలాంటి రాణిని వస్తున్నా ..
బెండ కాయ కిలో ఎంత..
నలభై
ఆ నలభై రూపాయలా.. అక్కడ అంత లేవే..
అంటూ వాడి వంక చూసింది
వాడు క్రూరంగా చూసాడు
వాడి మొహం అప్పుడే జైలు నుంచీ విడుదలై వచ్చినట్లుంది..
బీన్సు ఎంత..
అరవై...
ఆ అరవయ్యా అక్కడ అంత...వాణి మొహం చూసి తడబడి.. లేవే అన్న పదాన్ని ఆపేసింది..
కూరగాయల వాళ్ళ దగ్గర కత్తి వుంటుంది కదూ..
ఆలూ..
ముఫయ్..
ఆ..
సరే... ఓ అరకిలో ఈ..
వాడు తూచి ఇచ్చాడు
ఇవి అరకిలోనా..
కింద రాయేమన్నా పెట్టావా..
అంటూ చెక్ చెయ్య బోయేలోగా..
వాడు క్రూరంగా చూసి.. లక లక లక అన్నాడు పెద్దగా భయంకరంగా..
ఆ చీకట్లో పెట్రొమాక్సు లైట్ వెలుగులో
ఎవ్వరూ లేని ఆ రాత్రివేళ..
ముఖాన కత్తి గాటున్న వాణి ముఖం చూసి కెవ్వు మంటూ అరిచి పరుగందుకుంది సావిత్రి..
అందరూ సినిమా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నరోజులు
చూసొచ్చిన వాళ్ళు చూడని వారిని చూసేదాకా ఊరించి ఊరించి చంపేవారు..
ఎవ్వరి నోట్లో నూ లక లక లక శబ్దం అప్రయత్నంగా వచ్చేది
జ్యోతిక కళ్ళు తోం తోం తోం అంటూ తిప్పితే
ఎందరో గుండె పట్టుకుని హాలులోనే పడిపోయారు.. ట...
ఒకరోజు రైతు బజారుకు రాత్రి తొమ్మిదిన్నరకు బయలు దేరింది
కూరలకు సావిత్రి
కూరగాయలవాళ్ళు అందరు వాళ్ళ సామాను సర్దుకుని ఆటోలకు ఎక్కిస్తున్నారు
హయ్యో కూరలు లేవే..
రేపేమి వండేది
మాయదారి సినిమా చూస్తూ ఎంతపనిచేసాను
ఒక్క కూరలవాడైనా ఉండకపోడా
అనుకుంటూ నడుస్తూంది..
ఒకచోట వీధి లైటు విశ్రాంతి తీసుకుంది
చీకటిలోనే నడుస్తూంది కూరగాయలపై ఆందోళనతో సావిత్రి
దూరాన ఒక బండి
వాడూ వెళ్ళే ప్రయత్నం లో ఉన్నట్టుంది
వాడి దగ్గర అంత్యదశలో ఉన్న పెట్రొమాక్సు లైటు
బాబూ..
బాబూ..
ఆగు
అప్పుడే సర్దేయకు
నేను కొనడానికి వస్తున్నా..
వ్యాపారం చేసే వాణికి వినియోగదారుడే కదా రాజు..ఛ.. రాణి
అలాంటి రాణిని వస్తున్నా ..
బెండ కాయ కిలో ఎంత..
నలభై
ఆ నలభై రూపాయలా.. అక్కడ అంత లేవే..
అంటూ వాడి వంక చూసింది
వాడు క్రూరంగా చూసాడు
వాడి మొహం అప్పుడే జైలు నుంచీ విడుదలై వచ్చినట్లుంది..
బీన్సు ఎంత..
అరవై...
ఆ అరవయ్యా అక్కడ అంత...వాణి మొహం చూసి తడబడి.. లేవే అన్న పదాన్ని ఆపేసింది..
కూరగాయల వాళ్ళ దగ్గర కత్తి వుంటుంది కదూ..
ఆలూ..
ముఫయ్..
ఆ..
సరే... ఓ అరకిలో ఈ..
వాడు తూచి ఇచ్చాడు
ఇవి అరకిలోనా..
కింద రాయేమన్నా పెట్టావా..
అంటూ చెక్ చెయ్య బోయేలోగా..
వాడు క్రూరంగా చూసి.. లక లక లక అన్నాడు పెద్దగా భయంకరంగా..
ఆ చీకట్లో పెట్రొమాక్సు లైట్ వెలుగులో
ఎవ్వరూ లేని ఆ రాత్రివేళ..
ముఖాన కత్తి గాటున్న వాణి ముఖం చూసి కెవ్వు మంటూ అరిచి పరుగందుకుంది సావిత్రి..
Friday, 13 September 2013
అమ్మలూ ఇవ్వాళేం జరిగిందో తెలుసా..?
అమ్మలూ ఇవ్వాళేం జరిగిందో తెలుసా
ఆ నిర్భయ కేసు నిందితులకు ఉరిశిక్ష ఖాయమైందట..
దేశమంతా టీవీలలోనూ పేపర్లలోనూ తెగ ఆనందపడిపోతున్నారు
ఆ వెధవలు సుప్రీం కు కూడా అప్పీలు చేసుకోవచ్చటలే
మళ్ళీ ఓ సంవత్సరం విచారణ..
అయినా మన నిర్భయ చట్టం ఉందిగా
తప్పకుండా అక్కడా ఉరే..
ఇకపై అమ్మాయిలు ఏం భయపడక్కరలేదు
రేప్ చేసినా చంపినా పరవాలేదు..
మన నిర్భయ చట్టం ఉందిగా..
దోషులు ఎక్కడికీ తప్పించుకు పోలేరు..
వాళ్ళలో ఓ మైనర్ కూడా ఉన్నాడు గద
వాణ్ణి కోర్ట్ క్షమించి మూడు నెలలే శిక్ష వేసిందట..
ఎంతైనా పసివాడు ఏదో తెలిసీ తెలియక తప్పు చేసాడు
అయినా పసిపిల్లలకూ శిక్షలు వేస్తారా ఎవరన్నా..
వాడు మాత్రం మూడునెలలూ శిక్ష ముగించుకుని
మళ్ళీ మనముందు తిరుగుతూ కనిపిస్తాడు..
మన పిల్లలతోనూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ..
అయినా
ఈ సినిమాలూ ఇంటర్ నెట్లూ వచ్చి అడ్డమైనవీ చూపిస్తుంటే
పిల్లలు చెడిపోరా..
సినిమాలలో ఆడదాన్ని ఎంత చూపించాలో అంతా చూపించి
రెండర్థాల పాటలతో .. అరె ఎంత పిచ్చి దాన్ని
అది మా చిన్నతనంలో కదూ
కేవలం ఒకే ఒక బూతు అర్థంతో పాటలతో రెచ్చగొట్టి
ఈ సినిమా జనం నిర్భయ కోసం శాంతి అంటూ కొవ్వొత్తులు పట్టుకు బయలు దేరారే..
ముదు వీళ్ళని ఉరి తీయాలి
అయినా ఏం పర్లేదు అమ్మలూ మన నిర్భయ చట్టం ఉందిగా..
నీకు తెలుసా
ఒకప్పుడు ఆడపిల్ల కడుపులో ఉందని తెలియగానే..
కడుపులో పిల్లని కడుపులోనే చంపేసే వాళ్ళు జనం
సాకలేక..
మగపిల్లాడైతే ఆఖరికి తిండి పెడతాడు కదా..
అందుకని..
వినడానికి ఎంత బాగుంది కదూ..
నేను ఆడపిల్లని కన్నా ఎంత మురిసిపోయానో..
నీవు మాత్రం
ఆడబిడ్డని కనకమ్మా..
కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. చడీ చప్పుడు కాకుండా చంపేసెయ్
నిర్భయ చట్టం ఉంది కానీ
పెంచి పెద్దచేసి..
చదువు చెప్పించి..
ఎవరిచేతిలోనో చంపించటమెందుకు చెప్పు
మన చేతులారా మనమే చంపుకుంటే మంచిది కదా..
నీకు తెలుసా
ఒకప్పుడు ఆడపిల్ల కడుపులో ఉందని తెలియగానే..
కడుపులో పిల్లని కడుపులోనే చంపేసే వాళ్ళు జనం
సాకలేక..
మగపిల్లాడైతే ఆఖరికి తిండి పెడతాడు కదా..
అందుకని..
వినడానికి ఎంత బాగుంది కదూ..
నేను ఆడపిల్లని కన్నా ఎంత మురిసిపోయానో..
నీవు మాత్రం
ఆడబిడ్డని కనకమ్మా..
కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిస్తే.. చడీ చప్పుడు కాకుండా చంపేసెయ్
నిర్భయ చట్టం ఉంది కానీ
పెంచి పెద్దచేసి..
చదువు చెప్పించి..
ఎవరిచేతిలోనో చంపించటమెందుకు చెప్పు
మన చేతులారా మనమే చంపుకుంటే మంచిది కదా..
Subscribe to:
Posts (Atom)