నీలవేణికి పెళ్ళి చూపులు
ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు
లక్షల్లో జీతం
మంచి కుటుంబం
అబ్బాయి బుధ్ధిమంతుదు
ఇంట్లోఅందరూ ఒకటికి పది సార్లు ఇప్పటికి
ఈ విషయాలు ముచ్చటించుకుని మురిసిపోయారు
కానీ నీలవేణి మనసు మండిపోతూంది
ఎట్లా ఈ కార్యక్రమాన్ని అట్టర్ ఫ్లాప్ చెయ్యాలా
అని తెగ ఆలోచిస్తూంది
స్నేహితులతో మంత్రాంగం చేసింది
తలా ఒక సలహా చెప్పారు
మంగ అతగాణ్ణి పక్కకు తీసుకెళ్ళి
నాకీ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయమంది
సరిత ఆకాశరామన్న ఉత్తరం ఒకటి
మంచి మసాలా అపధ్ధాలను కల్పించి రాసి
వాళ్ళ మనసు విరిచేయొచ్చని ఐడియా ఇచ్చింది
ఇదేదో తేడాగుంది నేను జంపు
అని జ్యోతి అడ్రసు లేకుండాపోయింది
అతగాణి అఫీసుకు వెళ్ళి
అక్కడి అబ్బాయిలతో అతను చూసేలాగ
చనువుగా తిరిగి
తను చాలా బ్యాడ్ కారెక్టర్ అని అతను అనుకొనేలాగ చేయమని
పేద్ద అయిడియా ఇచ్చింది సురేఖ..
కానీ పెళ్ళి చూపులవరకూ కథ రానేవచ్చింది
ఛ..
పదకొండో సారి అనుకుంది నీలవేణి
బుట్టెడు పూలు నెత్తి మీద పెట్టారు
తనకు పూలంటే చచ్చే అలర్జీ..
మెడనిండా నగలు దిగేసారు
అమ్మవి బామ్మవి అత్తయ్యవి పిన్నివీ ఇంకా ఊరందరివీ..
ఒకరివి కాదంటే కోపం
వేసుకోనంటే నిష్టూరం
తనేమైనా బొమ్మా
తనకంటూ ఇష్టాఇష్టాలు లేవా..
ఈ పెద్దవాళ్ళున్నారే..
పెదవి కొరుక్కుంది..
తనసలే అందంగా ఉంటుంది
ఆ అబ్బాయికి కొంపదీసి నచ్చితే..
గుండె దడ దడ కొట్టుకుంది
నచ్చకపోవటమేమిటి నచ్చి తీరుతుంది
ఎలా..
అందరూ హాల్లో హాస్యాలాడుకుంటున్నారు
తను ఒక్కతీ రూములో
తను చిర చిర లాడుతుంటే
అందరూ తనను అలంకరించి
హాలులో చేరారు
పెరట్లోంచీ పారిపోతే..
ఎక్కడికి పారిపోతుంది
ఛ..
ఒక్కణ్ణీ సరిగ్గ ప్రేమించలేదు
ఎంతమంది వెంటపడ్డారు
ఒక్కడికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు
ఎవరిని చూసినా వీడు నాకు తగడు అనిపించేది..
సుధాకర్ ప్రాణం తీసుకుంటానన్నాడు
రాంచరణ్ వీధి మొదట్లో
నాలుగు సంవత్సరలు పడిగాపులు పడ్డాడు
కృష్ణ సత్య విక్కీ చక్రీ
హయ్యో
ప్రేమించి పెళ్ళి చేసుకోకుంటే మజా ఏముంది
హారి దేవుడా నాకు ఎన్ని కష్టాలు
ఇంతలో బిల బిల మంటు రోసీ లీల లావణ్య వాణి వచ్చేసారు
హాయ్..
ఎలాఉన్నావ్ అంటూ
వారిని చూసి నీలవేణి అమ్మానాన్న కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యారు
వచ్చారా
మీ స్నేహితురాలిని ఇంకా యేమైనా అలంకరించండి
తను కూడా మీరు లేరని దిగాలుగా వుంది
ఎంతైనా స్నేహితులు కదా
అలాగే ఆంటీ..
హాయ్ నీలూ
ఎలా ఉన్నావ్
అంటూ వయ్యారాలు పోతూ
నీలవేణి స్నేహితులు రూములోకి వెళ్ళారు
వారు మాట్లాడుతుంటే
తెలుగును చక్కెరలో ముంచి తీసి మాట్లాడుతున్నట్లుంది..
వారిని చూడగానే నీలవేణి ముఖం వెయ్యి క్యాండిల్స్ బల్బులా వెలిగింది
ఏంటే నీవేనా గుడిలో అమ్మవారేమో అనుకున్నా
రోసీ అంది
మా అక్క పెళ్ళి చూపులకి
ఒక సన్న చైన్ వేలికి ఒక ఉంగరం అంతే..
ఆ తల్లో ఒక గులాబీ..
ఏంచేయనే..
అంది నీలవేణి కంపరంగా
పైనేమో పూల షాపు
కిందంతా నగలషాపు
నీముందు నీ కివ్వబోయే కరెన్సీ పెడతారేమో..
అదో రిజర్వ్ బాంక్
పక పకా నవ్వింది
చాల్లెండే ఏదైనా ఉపాయం చెప్పకుండా ఆటపట్టిస్తున్నారు..
గునిసింది నీలవేణి
మరో ఇద్దరు అటొకరు ఇటొకరూ చెవిలో నీలవేణికిఏదో ఉపదేశం చేసారు
వెంటనే నీలవేణి ముఖం విప్పారింది
అమ్మయ్య మీరొచ్చారు
ఎంత ధైర్యం వచ్చిందో
అబ్బాయ్ తరఫు వాళ్ళూ వచ్చారు
అందరూ బిల బిలమంటూ బయటకు వెళ్ళి వారిని లోపలికి తీసుకొచ్చారు
మర్యాదలు చేసారు
అబ్బాయ్ డీసెంట్ గా వున్నాడు
అందంగా వున్నాడు
పిల్లని తీసుకురండి అన్నారు
ఆడవాళ్ళు లోపలికి వెళ్ళి చెప్పేసరికి
నలుగురు స్నేహితులూ నీలవేణిని తీసుకొస్తున్నారు
వస్తున్న నీలవేణిని చూసారు బంధువులు
మళ్ళీ అందరి చూపులూ మగపెళ్ళి వారివేపు మళ్ళాయి
వెంటనే ప్లాన్ నెంబర్ వన్ అప్లయ్ చేసింది నీలవేణి
కుంటుతూ నడవడం మొదలు పెట్టింది
ఇది చూసిన మగపెళ్ళి తరఫు వారు కంగారు పడ్డారు
ఏంటి అమ్మాయి కుంటుతుంది..
ఎలా వాళ్ళని అడగడం..
ఇది చూసిన నీలవేణి స్నేహితులు నవ్వును బిగపట్టుకున్నారు..
కూర్చోమ్మా..
వెంటనే నీలవేణి చంకలోంచీ కర్రలను తీసి కూచుంది
కుర్చీలో.వెంటనే నీలవేణి స్నేహితులు ఆ కర్రలను ఒకరినుంచీ ఒకరు అందుకుని గోడపక్క దాచేసారు
అవి నీలవేణి బాబాయ్ వాళ్ళ కొడుకువి..
వీళ్ళిలా ఉపయోగించుకున్నారు..
మగపెళ్ళి వాళ్ళ ముఖాలు నల్లబడ్డాయి
స్నేహితులు నలుగురూ "య్యస్ "అనుకున్నారు చూపులతో
ఇంతలో నీలవేణి బాబాయ్
అమ్మా నీలూ అంత సిగ్గయితే ఎలా
కాస్త అబ్బాయిని చూడు..
ఆనక నేను చూడలేదు మళ్ళీ చూడలంటె కుదర్దు..
దగ్గరికొచ్చి నెత్తిపై చిన్న దెబ్బవేసి అన్నాడు
సరేనంటూ తలౌఉపింది నీలూ
బాబాయ్ అటు తిరగ్గానే
మెల్లకన్ను పెట్టి తలెత్తుతూ తననే చూస్తున్న్ నెమ్మదిగామగపెళ్ళి వారివంక చూసింది..
దెబ్బకు దిమ్మ తిరిగి పోయింది వాళ్ళకి
ఈసారి మరింత ఆందోళన ఎక్కువైంది..
రోసీ లావణ్య మూతి బిగించి నవ్వసాగారు
నీలవేణికీ ఇదేదో తమాషాగానే ఉంది..
కానీ
పెళ్ళికొడుకు ఇదంతా కనిపెట్టాడు
అతనికి వీళ్ళ తంతు అర్థమైంది..
అమ్మాయికి నడవడానికేమైనా ఇబ్బందా అన్నయ్యగారూ అంది
పిల్లాడి తల్లి
అబ్బే అలాంటిదేం లేదమ్మా
నీలూ కాలేమైనా నొప్పిచేసిందా అన్నాడు నాన్న..
చక్కటి కళ్ళు కానీ కాస్త .. మెల్ల లా వుంది.
ఈసారి కాస్త కోపం వచ్చింది నీలూ నాన్నకి
ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు
మా పిల్లకి మెల్లా..
అన్నాడు కరుగ్గా..
నీలూ ఒకసారి తలెత్తూ..
నీలవేణికి తలెత్తక తప్పలేదు
మెల్ల మంత్రం ఫలించలేదు..
చక్కగా చూసింది..
అబ్బాయ్ అమ్మాయిని చూసి నవ్వాడు కొంటెగా..
లేదన్నయ్య గారూ అమ్మాయ్ లక్ష్మిలా వుంది..
నీలవేణి స్నేహితులు ఆ అబ్బాయిని చూసి అయిసయిపోయారు..
అందరి గుండెల్లోనూ సన్నని గిలిగింత
పిల్లని లోపలికి తీసుకెళ్ళండమ్మా అన్నాడు మధ్యవర్తి..
పెళ్ళి చూపుల తతంగం ముగిసింది
ఇచ్చి పుచ్చుకోవడాలు మాట్లాడుకుంటున్నారు
రెండోసారి కాఫీలు వెళ్ళాయి..
నీలవేణి స్నేహితులు రూములో చేరారు..
అబ్బాయ్ బావున్నాడే..
చేసేసుకో అంది లావణ్య..
అవునే ఆ అబ్బాయికేం తక్కువ..
అంది
అంది
కానీ జీవితంలో ఒకే ఒక్కసారి పెళ్ళి చేసుకుంటామే
కాస్త ప్రేమించి
అభిరుచులూ అభిప్రాయాలూ కలిసాకా చేసుకుంటే ఎంత బావుంటుంది చెప్పు..
దీనంగా అంది నీలవేణి..
అవునే.. పాపం..నీలవేణి
అందుకే ఎవరో ఒకరిని ప్రేమించవే ప్రేమించవే అని
చిలక్కు చెప్పినట్లు చెప్పానే..
అంది లావణ్య
సరేలే నీవు ప్రేమించు అనగానే ప్రేమ పుడుతుందా..
గుండెల్లో ఒక ఫీలింగ్ కలగొద్దూ
నాకు శశాంక్ ని చూడగానే అలాగే కలిగింది..
అందుకే ప్రేమించా
మరి వాడు చదువు రాని మొద్దు కదే..
చదువుదేం వుందే..
జీవితం మళ్ళీ రమ్మటే వస్తుందా..
లవ్ అనేది ఒక వరం అది అందరికీ దొరకదు..
అంది లావణ్య అరమోడ్పు కళ్ళతో
ఆరాధనగా చూసింది నీలవేణి
ఇలా వాళ్ళ సంభాషణ సాగి సాగి
ఇక మేం వెళ్తామే అని ఒకరికొకరు బై చెప్పుకొని వెళ్ళే పోయారు
అక్కడ పెళ్ళివాళ్ళూ వెళ్ళిపోయారు
రాత్రి నీలవేణీ జరిగిందంతా ఆలోచిస్తూ గడిపింది
నిద్రలో తను పెళ్ళయి ఆ అబ్బాయితో ఏడుస్తూ వెళ్ళిపోతున్నట్టు పీడకలలు..
మరుసటిరోజు తన జీవితంలో మరపురాని రోజు కాబోతూందని
నీలవేణికి తెలియదు
ఎప్పట్లానే తెల్లారింది
కాఫీలయ్యాక
అందరూ ఒకసారి క్రితం రోజు సంగతులు ముచ్చటించుకున్నారు
తరువాత తలోదారీ ఆఫీసులకు వెళ్ళిపోయారు
నీలవేణి కాలేజ్ కి వెళ్తూంది
దారిలో బస్సు చెడిపోయింది
ఆటోలు దొరకలేదు
కాలేజ్ టైమైపోయింది..
కాలేజ్ కెళ్ళాలా లేక ఇంటికా అన్న డైలమాలో
మెల్లిగా నడుస్తూంది నీలూ
ఇంతలో తనపక్కనే ఒక లావుటబ్బాయి నడచి వెళ్ళాడు
అతన్ని ఆసక్తిగా చూసింది
అతను పొడవాటి గుడ్డసంచీ వేసుకున్నాడు
కంటికి అద్దాలు ఉన్నాయి
అతను ఆరాం గా అటూ ఇటూ చూస్తూ
తొలిసారి హైదరాబాద్ వచ్చినట్లు
ఒక్కో భవనాన్నీ పైనుంచీ కిందిదాకా చూస్తూ నడుస్తున్నాడు..
అతని పక్క నడుస్తున్న చిన్నపాపని
హాయ్ బుజ్జీ అని బుగ్గపై ఒక చిటికె వేసాడు..
ఆ పాప ఇతన్ని చూసి నవ్వింది
దట్స్ గుడ్ అంటూ
వెనక్కి తిరిగి నడుస్తూ తల ఒక పక్కగా వంచి రాజేష్
ఖన్నాలా నవ్వాడు
దారిన పోతున్న ఒక బిచ్చగాడి భుజం చుట్టూ చేయివేసి రోడ్డు దాటించాడు..
ఈసారి ఈలవేస్తూ చెంగు చెంగున గెంతుతున్నాడు
అడ్డువచ్చిన ఒక చెట్టు చుట్టూ స్టయిల్ గా తిరిగాడు గిర్రున
ఇదంతా విచిత్రంగా వుంది నీలవేణికి
ఎవరబ్బా ఇతను
ఏంటిలా బిహేవ్ చేస్తున్నాడు..
వేరుశనక్కాయలు కొనుక్కొని
వంద ఇచ్చి చిల్లర అతను ఇవ్వబోతే
వద్దులే నీవే వుంచుకో అన్నాడు ఉదారంగా..

పరాకుగా నడుస్తున్న నీలవేణిని ఒకస్కూటర్ గుద్దేయబోయింది..
ఏంటమ్మా చూసి నడవ్వా ..
హయ్యో అంటూ తలకొట్టుకుని వెళ్ళి పోయాడు అతను
ఎక్కడినుంచీ వచ్చాడో కిందకు పడబోయిన నీలవేణి భుజాలు గిరుక్కున పట్టుకునాపాడు లావుటబ్బాయ్..
నీలవేణి సినిమాలోలా అతనిచేతుల్లో వాలిపోయింది..
అతను నీలవేణి కళ్ళల్లో కళ్ళుపెట్టిచూసి
ఆర్యూ ఓ కే..
అన్నాడు
హా.. హా..
అంది నీలూ
ఇద్దరూ కలిసి నడవసాగారు..
థాంక్స్ అంది నీలవేణి..
ఇట్స్ ఓ కే..
మీరు హైడ్రాబాడ్ కి కొత్తా అంది
నో .. అయాం బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ యూ నో..
మీరు ఎవరినైనా ప్రేమించారా..
అన్నాడు..
లే.. లేదు..
అంది..ముఖం ఎర్రబడింది..
ఏం లేదు అలా కలలు కంటూ నడుస్తుంటే
ఆక్సిడెంటయ్యే వాళ్ళంతా ప్రేమించాలని రూలుందా..
ఏం అనుకోకండి నేనిక్కడ ఏం అనిపిస్తే అది మాట్లాడతాను
ఇక్కడ యేం చెయ్యాలనిపిస్తే అది చేస్తాను..
గుండెలు కొట్టుకుంటూ అన్నాడు
అలాగా.. అన్నట్లు చూసింది
అయిస్ క్రీం బండి వచ్చింది..
కావాలా అని అడిగాడు..
వద్దు.. అంది మొహమాటంగా..
అతను వెళ్ళి నాలుగు అయిస్ క్రీం లు తెచ్చుకున్నాడు..
నాలుగెవరికీ..
నాకే..
నాలుగూ ఒకేసారి తింటున్నాడు
చిన్నపిల్లాడు తింటున్నట్టుంది..
నీల వేణి మదిలో యేవో ద్వారాలు తెరుచుకున్నాయ్
ఆమె అలా చూస్తుండగానే నాలుగూ నాకి నాకి తిన్నాడు
మీరు..
కాలేజ్ కి వెళ్ళాలి బస్ చెడిపోయింది..
ఎలాగూ వెళ్ళాలని లేదు..
అందుకే ఇలా రిలాక్స్డ్ గా నడుస్తున్నా..
నేనూ అంతే..
మొదట స్టడీస్ కి అమెరికాకెళ్ళా
మధ్యలో చెయ్యాలనిపించలే..
సడన్ గా కాలేజ్ మానేసి ఇండియా వచ్చా..
అవునా ఆశ్చర్యంగా చూసింది..
అవునండీ
నేనంతే
ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతా..
ఇక్కడ యేమనిపిస్తే అది చేస్తా..
అంటూ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి..
నీలవేణి గుండెల్లో గంటలు మోగాయ్..
మా మావయ్య ఉద్యోగమిప్పించాడు..
ఆస్రేలియాతో డీల్ అక్కడ నేనుండి సెటిల్ చేయాలి
సడన్ గా ఉద్యోగం మానేసా..
అవునండీ నేనంతే
ఇక్కడ యేమనిపిస్తే అది మాట్లాడతా
ఇక్కడ యేమనిపిస్తే అది చేతా..
మళ్ళీ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి
దారిపక్కన మురికి నీరు నిలిచివుంది
అందరూ దాన్ని దాటుకుంటూజాగ్రత్తగా వెళ్తున్నారు..
ఆ అబ్బాయ్ గబ గబా పరుగెత్తుకెళ్ళి ధబ్బున ఆ నీళ్ళల్లో జంప్ చేసాడు..
ఆ మురికి నీరు దారిన పోతున్న అందరిమీదా చిమ్మి వారి బట్టలు ఖరాబయ్యాయ్
ఏ.. పాగల్ హైక్యా..
కైసాకూద్ రా యే..
హఠ్..
చీదరించుకున్నారు అందరూ..
ఆ అబ్బాయి మాత్రం వీరి మాటలు లెక్క చెయ్యకుండ
చప్పట్లు కొడ్తూ నవ్వాడు..
చప్పట్లు కొడ్తూ నవ్వాడు..
మళ్ళీ జంప్ చేసాడు.
మళ్ళీ జంప్
అతని బట్టలూ ముఖం మురికి మురికి
కానీ అతను భలే ఎంజాయ్ చేస్తున్నాడు
నీలవేణి గుండెల్లో సితార్లు సందడి చేసాయి
ఆరాధనగా చూసింది
యు ఆల్సో వాంట్ టు డూ డూ లైక్ మీ కం కం అంటున్నాడు
నేఅలవేణీ నీళ్ళల్లో ఒక్క గెంతు గెంతింది..
భలే వుంది..
ఇద్దరూ అలా కొన్ని సార్లు గెంతి
బయటికొచ్చారు..
మై హార్టీస్ బీటింగ్ అని పాడుతున్నాడు ఆ అబ్బాయ్..
నీలవేణీ హం చేసింది..
ఇద్దరూ మళ్ళీ ఎనిమిది అయిస్ క్రీం లు కొనుక్కుని
నాకి నాకి తిన్నారు..
ఎన్నో మాట్లాదుకున్నారు..
టీ బంకుల్లో చాయ్ తాగుతూ
ఇద్దరి అభిప్రాయాలూ అభిరుచులూ కలిసాయ్
అనిపించింది నీలవేణీకి
ఇతనే ఇతనే నా సరిజోడు అంది ఆమె మనసు
చివరగా ఇద్దరూ అయ్ లవ్యూ అని చెప్పుకున్నారు..
No comments:
Post a Comment