ఆఖరి బంతి ఎప్పుడో యేమో..
టెన్షన్ తో నరాలు చిట్లి పోతున్నాయి
ఆఖరు పడితేగానీ మ్యాచ్ పూర్తవదు ఏమైనా జరగచ్చు
ఆఖరి బంతి వరకూ ఆడతా అంటాడు
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల స్టార్ బాట్స్ మాన్ ముఖ్యమంత్రి కిరణ్
మ్యాచ్ ఎప్పుడో ముగిసింది అంటారు తెలంగాణ వాదులు
ఆటముగిసింది ఆడుడుండదు అంటారు మన కేసీయార్
ఆఖరు బంతి దాకా చూడటమెందుకు
విభజనను అడ్డుకోడానికి అంటారు వైయస్సార్ వాళ్ళు
సిక్స్ కొట్టినా గెలవలేవు అంటారు మన కోదండరాం
మాకు 132 పరుగుల అధిక్యం అంటున్నారు హరీశ్ రావు
బాల్ లేదూ అంటూ కెవ్వున అరుస్తున్నారు డి.శ్రీనివాస్
ప్రజలతో కాంగ్రెస్ ఆడుతున్న ఈ మ్యాచ్ కి మన నేతల కామెంట్రీ ఇది
ఏమైనా అక్టోబర్ వచ్చేసింది కాబట్టి ప్రజల టెన్షన్ కు ముగింపు వచ్చిందనుకోవచ్చు
No comments:
Post a Comment