Saturday, 14 September 2013

చంద్రముఖి

అవి చంద్రముఖి విడుదలైన రోజులు
అందరూ సినిమా చూడాలని ఉవ్విళ్ళూరుతున్నరోజులు
చూసొచ్చిన వాళ్ళు చూడని వారిని చూసేదాకా ఊరించి ఊరించి చంపేవారు..
ఎవ్వరి నోట్లో నూ లక లక లక శబ్దం అప్రయత్నంగా వచ్చేది

జ్యోతిక కళ్ళు తోం తోం తోం అంటూ తిప్పితే 

ఎందరో గుండె పట్టుకుని హాలులోనే పడిపోయారు.. ట...

ఒకరోజు రైతు బజారుకు రాత్రి తొమ్మిదిన్నరకు బయలు దేరింది
కూరలకు సావిత్రి

కూరగాయలవాళ్ళు అందరు వాళ్ళ సామాను సర్దుకుని ఆటోలకు ఎక్కిస్తున్నారు
హయ్యో కూరలు లేవే..
రేపేమి వండేది
మాయదారి సినిమా చూస్తూ ఎంతపనిచేసాను
ఒక్క కూరలవాడైనా ఉండకపోడా
అనుకుంటూ నడుస్తూంది..
ఒకచోట వీధి లైటు విశ్రాంతి తీసుకుంది
చీకటిలోనే నడుస్తూంది కూరగాయలపై ఆందోళనతో సావిత్రి
దూరాన ఒక బండి
వాడూ వెళ్ళే ప్రయత్నం లో ఉన్నట్టుంది
వాడి దగ్గర అంత్యదశలో ఉన్న పెట్రొమాక్సు లైటు
బాబూ..
బాబూ..
ఆగు
అప్పుడే సర్దేయకు
నేను కొనడానికి వస్తున్నా..
వ్యాపారం చేసే వాణికి వినియోగదారుడే కదా రాజు..ఛ.. రాణి
అలాంటి రాణిని వస్తున్నా ..

బెండ కాయ కిలో ఎంత..

నలభై
ఆ నలభై రూపాయలా.. అక్కడ అంత లేవే..
అంటూ వాడి వంక చూసింది
వాడు క్రూరంగా చూసాడు
వాడి మొహం అప్పుడే జైలు నుంచీ విడుదలై వచ్చినట్లుంది..
బీన్సు ఎంత..
అరవై...
ఆ అరవయ్యా అక్కడ అంత...వాణి మొహం చూసి తడబడి.. లేవే అన్న పదాన్ని ఆపేసింది..
కూరగాయల వాళ్ళ దగ్గర కత్తి వుంటుంది కదూ..
ఆలూ..
ముఫయ్..
ఆ..
సరే... ఓ అరకిలో ఈ..
వాడు తూచి ఇచ్చాడు
ఇవి అరకిలోనా..
కింద రాయేమన్నా పెట్టావా..
అంటూ చెక్ చెయ్య బోయేలోగా..
వాడు క్రూరంగా చూసి.. లక లక లక అన్నాడు పెద్దగా భయంకరంగా..
ఆ చీకట్లో పెట్రొమాక్సు లైట్ వెలుగులో
ఎవ్వరూ లేని ఆ రాత్రివేళ..
ముఖాన కత్తి గాటున్న వాణి ముఖం చూసి కెవ్వు మంటూ అరిచి పరుగందుకుంది సావిత్రి.. 




No comments:

Post a Comment