పరాకుగా నడుస్తున్న నీలవేణిని ఒకస్కూటర్ గుద్దేయబోయింది..
ఏంటమ్మా చూసి నడవ్వా ..
హయ్యో అంటూ తలకొట్టుకుని వెళ్ళి పోయాడు అతను
ఎక్కడినుంచీ వచ్చాడో కిందకు పడబోయిన నీలవేణి భుజాలు గిరుక్కున పట్టుకునాపాడు లావుటబ్బాయ్..
నీలవేణి సినిమాలోలా అతనిచేతుల్లో వాలిపోయింది..
అతను నీలవేణి కళ్ళల్లో కళ్ళుపెట్టిచూసి
ఆర్యూ ఓ కే..
అన్నాడు
హా.. హా..
అంది నీలూ
ఇద్దరూ కలిసి నడవసాగారు..
థాంక్స్ అంది నీలవేణి..
ఇట్స్ ఓ కే..
మీరు హైడ్రాబాడ్ కి కొత్తా అంది
నో .. అయాం బార్న్ అండ్ బ్రాట్ అప్ హియర్ యూ నో..
మీరు ఎవరినైనా ప్రేమించారా..
అన్నాడు..
లే.. లేదు..
అంది..ముఖం ఎర్రబడింది..
ఏం లేదు అలా కలలు కంటూ నడుస్తుంటే
ఆక్సిడెంటయ్యే వాళ్ళంతా ప్రేమించాలని రూలుందా..
ఏం అనుకోకండి నేనిక్కడ ఏం అనిపిస్తే అది మాట్లాడతాను
ఇక్కడ యేం చెయ్యాలనిపిస్తే అది చేస్తాను..
గుండెలు కొట్టుకుంటూ అన్నాడు
అలాగా.. అన్నట్లు చూసింది
ఇద్దరూ కలిసి నడుస్తున్నారు
అయిస్ క్రీం బండి వచ్చింది..
కావాలా అని అడిగాడు..
వద్దు.. అంది మొహమాటంగా..
అతను వెళ్ళి నాలుగు అయిస్ క్రీం లు తెచ్చుకున్నాడు..
నాలుగెవరికీ..
నాకే..
నాలుగూ ఒకేసారి తింటున్నాడు
చిన్నపిల్లాడు తింటున్నట్టుంది..
నీల వేణి మదిలో యేవో ద్వారాలు తెరుచుకున్నాయ్
ఆమె అలా చూస్తుండగానే నాలుగూ నాకి నాకి తిన్నాడు
మీరు..
కాలేజ్ కి వెళ్ళాలి బస్ చెడిపోయింది..
ఎలాగూ వెళ్ళాలని లేదు..
అందుకే ఇలా రిలాక్స్డ్ గా నడుస్తున్నా..
నేనూ అంతే..
మొదట స్టడీస్ కి అమెరికాకెళ్ళా
మధ్యలో చెయ్యాలనిపించలే..
సడన్ గా కాలేజ్ మానేసి ఇండియా వచ్చా..
అవునా ఆశ్చర్యంగా చూసింది..
అవునండీ
నేనంతే
ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడతా..
ఇక్కడ యేమనిపిస్తే అది చేస్తా..
అంటూ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి..
నీలవేణి గుండెల్లో గంటలు మోగాయ్..
మా మావయ్య ఉద్యోగమిప్పించాడు..
ఆస్రేలియాతో డీల్ అక్కడ నేనుండి సెటిల్ చేయాలి
సడన్ గా ఉద్యోగం మానేసా..
అవునండీ నేనంతే
ఇక్కడ యేమనిపిస్తే అది మాట్లాడతా
ఇక్కడ యేమనిపిస్తే అది చేతా..
మళ్ళీ గుండెలు కొట్టుకున్నాడు..
అవునా ఆశ్చర్యంగా చూసింది నీలవేణి
దారిపక్కన మురికి నీరు నిలిచివుంది
అందరూ దాన్ని దాటుకుంటూజాగ్రత్తగా వెళ్తున్నారు..
ఆ అబ్బాయ్ గబ గబా పరుగెత్తుకెళ్ళి ధబ్బున ఆ నీళ్ళల్లో జంప్ చేసాడు..
ఆ మురికి నీరు దారిన పోతున్న అందరిమీదా చిమ్మి వారి బట్టలు ఖరాబయ్యాయ్
ఏ.. పాగల్ హైక్యా..
కైసాకూద్ రా యే..
హఠ్..
చీదరించుకున్నారు అందరూ..
ఆ అబ్బాయి మాత్రం వీరి మాటలు లెక్క చెయ్యకుండ
చప్పట్లు కొడ్తూ నవ్వాడు..
మళ్ళీ జంప్ చేసాడు.
మళ్ళీ జంప్
అతని బట్టలూ ముఖం మురికి మురికి
కానీ అతను భలే ఎంజాయ్ చేస్తున్నాడు
నీలవేణి గుండెల్లో సితార్లు సందడి చేసాయి
ఆరాధనగా చూసింది
యు ఆల్సో వాంట్ టు డూ డూ లైక్ మీ కం కం అంటున్నాడు
నేఅలవేణీ నీళ్ళల్లో ఒక్క గెంతు గెంతింది..
భలే వుంది..
ఇద్దరూ అలా కొన్ని సార్లు గెంతి
బయటికొచ్చారు..
మై హార్టీస్ బీటింగ్ అని పాడుతున్నాడు ఆ అబ్బాయ్..
నీలవేణీ హం చేసింది..
ఇద్దరూ మళ్ళీ ఎనిమిది అయిస్ క్రీం లు కొనుక్కుని
నాకి నాకి తిన్నారు..
ఎన్నో మాట్లాదుకున్నారు..
పేవ్ మెంట్ మీద కూచుని
టీ బంకుల్లో చాయ్ తాగుతూ
ఇద్దరి అభిప్రాయాలూ అభిరుచులూ కలిసాయ్
అనిపించింది నీలవేణీకి
ఇతనే ఇతనే నా సరిజోడు అంది ఆమె మనసు
చివరగా ఇద్దరూ అయ్ లవ్యూ అని చెప్పుకున్నారు..